అసురుడి కోసం రంగం సిద్ధం

గత ఏడాది తమిళ్ లో విడుదలైన అసురన్ రీమేక్ తెలుగులో అసురుడు పేరుతో రూపొందబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఈ నెల 20 నుంచి మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం యూనిట్ లొకేషన్ల వేటలో ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు అధిక శాతం షూటింగ్ అనంతపూర్ చుట్టుపక్క ప్రాంతాల్లో జరగబోతున్నట్టు సమాచారం. కర్నూల్, పల్నాడు, తమిళనాడులోని కొన్ని గ్రామాలను పరిశీలించినప్పటికీ ఫైనల్ గా కరువు జిల్లా కేంద్రాన్ని ఎంచుకున్నట్టుగా తెలిసింది. 

అసురన్ పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో సాగే ఒక ఇంటెన్స్ రివెంజ్ డ్రామా.వెనుకబడిన వర్గానికి చెందిన హీరో అగ్ర వర్ణాలకు ఎదురుతిరిగి తన కుటుంబాన్ని ప్రమాదంలో నేట్టేసుకునే ఎమోషనల్ జర్నీ. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండటంతో అక్కడ భారీ హిట్ దక్కించుకుంది. అందుకే సురేష్ బాబు, వెంకటేష్ లు ఏరికోరి మరీ హక్కులు కొనుక్కున్నారు.
వెంకటేష్ గత ఏడాది రెండు సినిమాలు చేశారు. ఎఫ్2 బ్లాక్ బస్టర్ కాగా వెంకీ మామ కమర్షియల్ గా పాస్ అనిపించుకుంది. అదే ఊపులో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలనీ ప్లాన్ చేసుకున్న వెంకీ ఈ అసురన్ రీమేక్ కు శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. మరీ సాఫ్ట్ ఫ్యామిలీ మూవీస్ తీసే దర్శకుడు ఈ సబ్జెక్టుకు ఎంతవరకు న్యాయం చేయగలడు అనే దాని మీద ప్రేక్షకులకు అనుమానాలు లేకపోలేదు. షూట్ త్వరగానే పూర్తి చేసి జూన్ లోపే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీలక పాత్రల కోసం అందరూ కొత్త నటీనటులను తీసుకున్నట్టు తెలిసింది. వెంకీ భార్య పాత్రలో ముందు శ్రేయను అనుకున్నప్పటికీ ఫైనల్ గా ప్రియమణి లాక్ అయినట్టుగా అప్ డేట్. 
Show comments