nagidream
QG Movie Telugu World Wide Release Rights: ఎన్టీఆర్ శ్రీను సమర్పిస్తున్న క్యూజీ గ్యాంగ్ వార్ సినిమాకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులని రుషికేశ్వర్ ఫిలిమ్స్, ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ దక్కించుకున్నాయి.
QG Movie Telugu World Wide Release Rights: ఎన్టీఆర్ శ్రీను సమర్పిస్తున్న క్యూజీ గ్యాంగ్ వార్ సినిమాకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులని రుషికేశ్వర్ ఫిలిమ్స్, ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ దక్కించుకున్నాయి.
nagidream
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ క్యూజీ గ్యాంగ్ వార్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి వివేక్ కుమార్ కన్నన్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. మరో నిర్మాతగా గాయత్రి సురేష్ వ్యవహరించారు. ఫిల్మ్ నటి ఎంటర్టైన్మెంట్, వై స్టూడియోస్ సంయుక్త బ్యానర్స్ పై ఈ మూవీని నిర్మించారు. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్, ఫిల్మ్ నటి ఎంటర్టైన్మెంట్, వై స్టూడియోస్ దక్కించుకున్నాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఆయా ప్రాంతాల్లో సినిమా రిలీజ్ రైట్స్ ని దక్కించుకునేందుకు బడా నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ఇంత ఎక్కువ పోటీలో కూడా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ ని రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఇంత భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. క్యూజీ మూవీ తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను దక్కించుకున్న సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడారు. తనకు తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులని ఇచ్చిన తమిళ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంత ఎక్కువ కాంపిటీషన్ లో కూడా క్యూజీ సినిమా తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే హక్కులను తనకు ఇచ్చిన తమిళ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన దక్కించుకుందని.. అలానే ఇవాళ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుందని అన్నారు. నటుడు జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ల నటన ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఫిల్మ్ నటి ఎంటర్టైన్మెంట్, వై స్టూడియోస్, రుషికేశ్వర్ ఫిల్మ్స్ సంస్థల ద్వారా ఈ క్యూజీ మూవీని ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత వేణుగోపాల్ అన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని పట్టించుకోకుండా ప్రేక్షకులు కంటెంట్ నచ్చితే చిన్న సినిమాని కూడా విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేస్తారని నిర్మాత వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.