iDreamPost
android-app
ios-app

Bhagyashri Borse: మరో ఛాన్స్ కొట్టేసిన రవితేజ హీరోయిన్ భాగ్య శ్రీ!

  • Published Sep 09, 2024 | 8:36 PM Updated Updated Sep 09, 2024 | 8:36 PM

Bhagyasrhi Borse: మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Bhagyasrhi Borse: మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Bhagyashri Borse: మరో ఛాన్స్ కొట్టేసిన రవితేజ హీరోయిన్ భాగ్య శ్రీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. కొంతమంది నిలదొక్కుకొని పెద్ద స్టార్ హీరోయిన్స్ అవుతారు. కానీ కొందరు మాత్రం ఒక సినిమా చేసిన తరువాత మళ్ళీ కనిపించరు. మరికొందరు అయితే ఒకటి, రెండు సినిమాలతోనే లక్కీ ఛాన్సులు కొట్టేస్తుంటారు. అలా ఎంతోమంది హీరోయిన్లు టాలీవుడ్లోకి వచ్చి టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. దశాబ్దాల పాటు తమ హవా కొనసాగించారు. భారీ హిట్లు అందుకొని బిజీ హీరోయిన్లుగా దూసుకుపోయారు. ఎన్నో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలానే తాజాగా రవితేజ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఆమె భాగ్య శ్రీ బోర్సే.

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే యూత్ మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది. తన గ్లామర్ తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రమోషన్లలో యాక్టీవ్ గా పాల్గొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో ఆమె అందం, ఆమె డ్యాన్సులు, ఆమె నటన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫస్ట్ సినిమాతోనే బాగా పాపులర్ అయ్యింది. మొదటి సినిమాతో ఇంతలా క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. తాజాగా ఆమె మరో ఆఫర్ ని సొంతం చేసుకుంది. ఇక ఆమె సొంతం చేసుకున్న ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Bhagyashri Borse 2

టాలీవుడ్ లో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సీతా రామం సినిమాతో తెలుగులో ఇంకా ఎక్కువ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన నటించబోతున్న తాజా సినిమా కాంత. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ ఛాన్స్ కొట్టేసింది. సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే ఈ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైద్రాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ మూవీకి క్లాప్ కొట్టారు. ఈ సినిమాని దుల్కర్ సల్మాన్, రానా కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet