Idream media
Idream media
కేంద్రంతో వరి అంశంపై మొదలైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం జాతీయ రాజకీయాల్లో పలు అంశాల చుట్టూ తిరుగుతోంది. కొత్త రాజకీయ పార్టీ అవతరణ దిశగా కూడా నడుస్తోంది. తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డ కేసీఆర్ ఈసారి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి బాసటగా నిలిచారు. రాహుల్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విరుచుకుపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బిశ్వా శర్మపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేస్తోంది. కాగా.. అస్సాం మొదలైన యుద్ధం భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందని, అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో లేదో మోదీ సర్కార్ ఆధారాలను బయటపెట్టాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కౌంటరిచ్చారు.
కొద్ది రోజులుగా బీజేపీపై తీవ్రస్థాయిలో కేసీఆర్ విరుచుకుపడుతుండడంతో కాషాయ పార్టీ నేతలు కూడా రివర్స్ అటాక్ కు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఒక్కొక్కరు ఒక్కో అంశంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ దిష్టిబొమ్మల దహనంతో అగ్గి రాజేసింది బీజేపీ.
ఇప్పుడు తాజాగా సర్జికల్ స్ట్రయిక్స్‌కు సాక్ష్యమేదీ? అన్న కేసీఆర్ ప్రశ్నకు స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు, వారిని అవమానిస్తున్నారు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన… మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు? అంటూ ఫైర్ అయ్యారు.. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారత్ సహించదు అని కేసీఆర్‌ను హెచ్చరించారు హిమంత బిశ్వా శర్మ.
Also Read : అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ.. : కేసీఆర్