ఆసియా కప్ 2022లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినపుడు దేశం మొత్తం సంబరాలు జరుపుకుంది. స్టేడియంలో ప్రేక్షకులు జాతీయ జెండాలు చేత పట్టుకుని వందేమాతరం పాడుతూ సందడి చేశారు. అయితే ఒక్కరు మాత్రం జెండాను చేతిలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన ఎవరో కాదు BCCI కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా! మ్యాచ్ గెలిచిన సమయంలో స్టేడియంలోనే ఉన్న జై షా చప్పట్లతో భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అదే టైంలో ఒకరు ఆయన చేతికి జెండా ఇవ్వబోయారు. కానీ ఆయన వద్దని తల ఊపి చప్పట్లు కొడుతూ ఉండిపోయారు. దీనిపై అభిమానులు భగ్గుమంటున్నారు. అమిత్ షా రాజకీయ ప్రత్యర్థులు కూడా జై షాని టార్గెట్ చేశారు. జాతీయ జెండా అంటే ఇంత చులకన భావమా అని ప్రశ్నించారు.
Why did Jay Shah refuse to hold the Tricolor. Why such disdain towards the Indian flag? #INDvPAK pic.twitter.com/sjLn1eJ1wI
— Gaurav Pandhi (@GauravPandhi) August 28, 2022
కానీ మరికొందరు మాత్రం జై షా చేసిందాంట్లో తప్పేం లేదంటున్నారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన జై షా, అన్ని దేశాల పట్ల తటస్థంగా ఉండాలన్న code of conduct వల్లే అలా ప్రవర్తించారని వివరిస్తున్నారు.