iDreamPost
android-app
ios-app

Ashes Series , Second Test – రెండో టెస్ట్.. భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా

  • Published Dec 16, 2021 | 3:25 PM Updated Updated Dec 16, 2021 | 3:25 PM
Ashes Series , Second Test – రెండో టెస్ట్.. భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా

యాషెస్‌ సిరీస్‌ రెండవ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ సాధించే దిశగా పయనిస్తోంది. ఆడిలైడ్‌ ఓవల్ లో జరుగుతున్న రెండవ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్‌ హారిస్‌ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔట్‌ అయ్యాడు.

ఆస్ట్రేలియా జట్టు నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, లబూషెన్‌తో కలిసి రెండవ వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వార్నర్‌ 95 పరుగులు (11*4) చేసి జట్టు స్కోర్‌ 176 వద్ద ఔటయ్యాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరు 156 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే.

ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టులో లబుషెన్‌ 95 (7*4), కెప్టెన్‌ స్మిత్‌ 18(2*4) స్కోరుతో క్రీజ్‌లో ఉన్నారు. మూడవ వికెట్‌కు లబుషెన్‌, స్మిత్‌లు కలిసి ఇన్నింగ్స్‌ ముగిసే సమయానికి 45 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌ జట్టులో బ్రాడ్‌, స్టోక్స్‌లు చెరొకటి చొప్పున వికెట్లు సాధించారు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేయనుంది. ఇంకా ఆ జట్టు తరుపున ట్రావిస్‌ హెడ్‌, గ్రీన్‌, అలెక్స్‌ క్యారీలు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది.

Also Read : నేటి నుంచి రెండవ టెస్టు.. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి