iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన అర్జున్.. ఎలిమినేషన్ అంతా ఫేక్ అంటూ..!

బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన అర్జున్.. ఎలిమినేషన్ అంతా ఫేక్ అంటూ..!

ఇప్పుడు సోషల్ మీడియా, బుల్లితెర అంతా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించే చర్చ, రచ్చ జరుగుతోంది. ఆరోవారం నయనీ పావని ఎలిమినేట్ కాగానే ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ గొడవ మొదలైంది. నెటిజన్స్, బిగ్ బాస్ ప్రేక్షకులు అంతా నయనీ పావనీకి అన్యాయం జరిగింది అంటూ నెట్టింట నిరసనలు తెలుపుతున్నారు. నయనీ పావనీ కూడా ఎలిమినేట్ అయినప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తూనే ఉంది. ఆమెకు గీతూ రాయల్, యాంకర్ శివ వంటివాళ్లు కూడా ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అర్జున్ కల్యాణ్ చేరాడు.

నయనీ పావనీ ఎలిమినేట్ కావడంపై అర్జున్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆమెకు అన్యాయం జరిగింది అనే కోణంలో కామెంట్ చేశాడు. నయనీని ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షో తమ క్రెడిబిలిటీని కోల్పోయింది అన్నాడు. “నయనీ పావనీ విషయంలో చాలా బాధగా ఉంది. ఆమెకు ఇలా జరగకూడదు. షోకి వాళ్ల క్రెడిబిలిటీకి ఇది చాలా పెద్ద లాస్. ఓటింగ్ కి ఎలిమినేషన్ కు ఎలాంటి సంబంధం లేదని.. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అన్ని సీజన్స్ కి సంబంధించిన ఓటింగ్- ఎలిమినేషన్ వివరాలు ఇవ్వాలని ఎవరైనా పిల్ దాఖలు చేయాలి” అంటూ అర్జున్ కల్యాణ్ పోస్ట్ చేశాడు. అయితే అక్కడితో ఆగకుండా ఎవరైతా తన పోస్టుకు కామెంట్ పెడుతున్నారో వాటికి కూడా అర్జున్ కల్యాణ్ రియాక్ట్ అయ్యాడు.

అర్జున్ కల్యాణ్ సమాధానాలు చెబుతూ మరిన్ని ఆరోపణలు చేశాడు. పలు అనుమానాలు రేకెత్తించేలా కామెంట్స్ చేశాడు. ఇలాంటి పిల్స్ తీసోకోవడానికి కోర్టులు ఖాళీగా లేవు అని ఒకరంటే.. “చాలామంది ఈ షో చూస్తూ ఓట్లు వేస్తున్నారు. వాళ్లు ఇలాంటి నిర్ణయాల వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. కంటెస్టెంట్స్ కూడా వీళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. పైగా ఓట్లు మాత్రమే పరిగణలోకి వస్తాయని చెప్తుంటారు. ఈ కారణాలు చాలు పిల్ ఫైల్ చేయడానికి” అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. అలాగే మరిన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. “ఇలాంటి ఎలిమినేషన్స్ తో వారికి కావాల్సిన టీఆర్పీ కూడా వస్తుంది. మా సీజన్ లో కూడా కొన్ని ఇలాంటి ఎలిమినేషన్స్ చేసి ప్రజలు షో చూసేలా చేశారు” అన్నాడు.

మీరు ఎందుకు మీ ఎలిమినేషన్ జరిగినప్పుడు మాట్లాడకుండా.. ఇప్పుడు మాట్లాడుతున్నారు అని ఒక నెటిజన్ అర్జున్ ను సూటిగా ప్రశ్నించాడు. అందుకు “నేను ఆ సమయంలో కాంట్రాక్ట్ లో ఉన్నాను. నా ఎలిమినేషన్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు. కానీ, అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అంతేకాకుండా మేము సైన్ చేసిన ఒక క్లాజ్ ఏంటంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎప్పుడైనా, ఎలాగైనా, ఎటువంటి కారణం చెప్పకుండా ఎలిమినేట్ చేయచ్చు” అంటూ అర్జున్ కల్యామ్ అసలు బిగ్ బాస్ గుట్టు మొత్తాన్ని నెట్టింట రట్టు చేశాడు. అంతేకాకుండా ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ వల్ల మాత్రమే జరగవని.. వాళ్లు ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తున్నారు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ షోపై మరోసారి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. అర్జున్ కల్యాణ్ లాంటి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇలాంటి కామెంట్స్ చేయడం షోకి చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరి.. అర్జున్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి