Uppula Naresh
Uppula Naresh
ఉదయం లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా రోజులో దాదాపు నాలుగు అయిదు సార్లకుపైగా తాగుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రం.. చాయ్ తాగే క్రమంలో అప్పుడప్పుడు అందులో బిస్కెట్స్ వేసుకుని తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడం వల్ల చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. చాయ్ తో పాటు బిస్కెట్స్ తినడం కలిగే నష్టాలు ఏంటి? అసలు నిపుణులు ఏం చేబుతున్నారో తెలియాలంటే ఖచ్చితంగా ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
ఈ రోజుల్లో చాలా మంది చాయ్ తో పాటు అప్పుడప్పుడు అందులో బిస్కెట్స్ వేసుకుని తింటుంటారు. ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిస్కెట్లలో సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల హైపర్ టెన్షన్ తో పాటు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో పాటు బీపీ పెరగి హైపర్ టెన్షన్ వచ్చే ఆస్కారం ఉంది. ఇంతే కాదండోయ్.. జీర్ణక్రియ దెబ్బతినడంతో పాటు మలబద్దకం, షుగర్ రావడం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చాయ్ తో పాటు బిస్కెట్స్ తినడం తగ్గించి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి తినడం మానేసి తాజా పండ్లు తినడం ఉత్తమం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.