టిడిపి నేతలే నవ్వుకుంటున్నారా ?

చంద్రబాబునాయుడు మాటలు విని చివరకు తెలుగుదేశంపార్టీ నేతలే నవ్వుకుంటున్నారా ? అవుననే సమాధానం వస్తోంది. ఎల్జీ కంపెనీ అనుమతుల విషయంలో టిడిపి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలవుతోంది. తాజాగా ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు బాధ్యులు మీరంటే మీరేనంటూ టిడిపి, వైసిపి నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో నానా గోల జరుగుతోంది.

ఇక్కడ కంపెనీకి అనుమతులు ఇచ్చింది ఎవరు, విస్తరణకు అనుమతులు ఇచ్చింది ఎవరు ? అనే అంశాలపై చర్చలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి అనుమతి, విస్తరణకు ఆమోదం అన్నది రాతమూలకంగానే జరుగుతుంది. కాబట్టి ప్రతీ నిర్ణయానికి రికార్డుంటుందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయాడు. హిదుస్ధాన్ పాలిమర్స్ కు అనుమతులు ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వమే అంటు సొల్లు చెప్పటమే విచిత్రంగా ఉంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఎవరి హయాంలో అసలు కంపెనీ ఏపిలో ఏర్పడింది అన్నది కాదు. చంద్రబాబునాయుడు సిఎం అయిన తర్వాత ఏమి జరిగింది అన్నదే ముఖ్యం. చంద్రబాబు సిఎంగా ఉన్నపుడే 1998లో మొదటిసారి అగ్ని ప్రమాదం జరిగింది. అప్పట్లో కూడా ఫ్యాక్టరీని తరలించాలని పెద్ద గోల జరిగితే అప్పట్లో మంత్రులు, ఎంఎల్ఏలుగా ఉన్న టిడిపి నేతలు చంద్రబాబు కలిసి గొడవను అణిచివేశారు. ఇపుడు గోల చేసినట్లే అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.

జనావాసాల మధ్య కంపెనీని ఎందుకు ఉంచారంటూ ఇపుడు ప్రశ్నిస్తున్న చంద్రబాబు తాను సిఎంగా ఉన్నపుడు ఇదే కంపెనీని ఎందుకు తరలించలేదు ? 2018లో కంపెనీ విస్తరణకు అనుమతులు ఇచ్చిందెవరు ? అప్పట్లో సిఎంగా ఉన్నది చంద్రబాబే కదా ? ఫ్యాక్టరీ విస్తరణలో భాగంగా సిహాచలం దేవస్ధానం భూములు 162 ఎకరాలను 2015లో ఇచ్చింది వాస్తవం కాదా ? అప్పుడు అధికారంలో ఉన్నది తానే అన్న విషయాన్ని చంద్రబాబు బహుశా మరచిపోయాడేమో ?

మొత్తానికి వాస్తవాలను వక్రీకరిస్తు టెలి కాన్ఫరెన్సులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో నేతలే నవ్వుకునే పరిస్ధితికి దిగజారిపోయాడు.

అలాగే గ్యాస్ ప్రమాదం జరిగినపుడు టిడిపి ఎంఎల్ఏలు స్పందించిన విధానంపైన కూడా చంద్రబాబ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంటే రాజకీయంగా టిడిపి ఎంఎల్ఏలు రచ్చ చేసి మైలేజీ తేలేదని, పైగా ప్రభుత్వం సహాయచర్యలు బాగా చేసిందని సొంత ఎంఎల్ఏ గణబాబు చెప్పటాన్ని చంద్రబాబు తప్పు పట్టినట్లు సమాచారం. మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాటలు పార్టీలోనే నవ్వుల పాలవుతున్నదన్న మాట.

Show comments