Idream media
Idream media
జగన్ ను ఢీ కొట్టాలంటే చంద్రబాబు ఒక్కరి తరం కాదని టీడీపీకి తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనడం కష్టమేనన్ననిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు. ఎప్పటి నుంచో బీజేపీతో కలిసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా తనదైన శైలిలో తెరవెనుక వ్యూహాలు రచిస్తున్నారు. ఆర్ ఎస్ ఎస్ పెద్దల ద్వారా తన అభిలాషను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీ నాయకత్వం బీజేపీతో జట్టుకట్టడానికి తహతహలాడుతోంది. అయితే ఆ పార్టీ ససేమిరా అంటోంది. 2014లో బీజేపీతో చేతులు కలిపిన ఆయన అధికారం అందిపు చ్చుకున్నారు. అయితే.. 2018 నాటికి ఆ చెలిమి కాస్తా.. దెబ్బతిని కేంద్రంలోని నరేంద్ర మోడీని అధికారం నుంచి దింపే వరకు నిద్రపోనంటూ చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. పైగా ఆయన్ను ఓడించాలని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరిగి మరీ ప్రచారం చేశారు. ఇదే ఇప్పుడు ఆయనకు పెద్ద మైనస్గా మారిపోయింంది. ఏపీలో బీజేపీ నేతలు.. చంద్రబాబుపై వ్యతిరేకత పెద్దగా వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే.. బాబుతో కలిసినప్పుడు. 2014లో నాలుగు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానంలో బీజేపీ విజయందక్కించుకుంది.
ఇదే ఫార్ములాను వచ్చే ఎన్నికల్లో వాడుకుంటే.. ఎలాగూ.. జనసేన కూడా ఉంది కనుక.. కచ్చితంగా నాలుగు నుంచి ఐదు స్థానాలు కొట్టేయొచ్చని.. కొందరు నేతలు భావిస్తున్నారు. పైగా బాబు ఒక్కరితోనే ఉంటే ఏపీలో ఎదగలేం అన్న నిర్ణయానికి కొందరు నేతలు వచ్చారు. వారు కూడా ఈ పొత్తు కోసం బాబును బాగా ప్రోత్సహిస్తున్నారు. సీట్ల పంపకాల్లో జనసేనతో పెద్దగా ఇబ్బందులుండవనే భావనలో ఉన్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వంటి ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారు బాబుకు సానుకూలంగానే ఉన్నప్ప టికీ… మోడీని దింపేస్తాను.. అంటూ.. గత ఎన్నికల సమయంలో బాబు చేసిన వ్యాఖ్యలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.
దీంతో బాబు తప్ప.. అనే ధోరణిలో వారు ఉన్నారు. అయినప్పటికీ.. చంద్రబాబు తన ప్రయత్నాలు మాత్రం మానుకోవడం లేదు. బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్తో చంద్రబాబుకు లోపాయికారీ సంబంధం ఉంది. బాబు పాలనను ఆర్ ఎస్ ఎస్ తరచుగా పొగుడుతూనే ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏపీ వంటి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని.. మోహన్ భగవత్ వంటివారు పిలుపునిచ్చేవారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ పైన, వైసీపీపైనా ఆర్ ఎస్ ఎస్ తీవ్ర వ్యతిరేకతతో ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకుని బీజేపీతో తిరిగి పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ ప్రయత్నాలు మేరకు ఫిలిస్తాయో చూడాలి. గతంలో అంటే.. ఆర్ ఎస్ ఎస్ ఏం చెప్పినా.. బీజేపీ చేసేది. కానీ ఇప్పుడు మోడీ షాల మాటే కీలకం. ఇలాంటి సమయంలో చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా?