Venkateswarlu
Venkateswarlu
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దూర ప్రయాణాల కోసం ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను వాడుతోంది. ఈ బస్సులకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో చిత్తూరు జిల్లా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి.. అంటే శనివారం నుంచి ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఆర్టీసీ అధికారి ఎం భాస్కర్ వెల్లడించారు. చిత్తూరు నుంచి ఇతర జిల్లాలకు.. ముఖ్యంగా కడప, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాకు వెళ్లే బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు తిరుపతి-నెల్లూరుకు వెళ్లటానికి బస్సు ఛార్జీ 350 రూపాయలు ఉండేదని, దాన్ని 300 రూపాయలకు తగ్గిస్తున్నామని అన్నారు. తిరుపతి-కడప వెళ్లటానికి ఛార్జీ 340 రూపాయలు ఉండగా దాన్ని 290 రూపాయలకు.. తిరుపతి- మదనపల్లెకు వెళ్లటానికి బస్సు ఛార్జీ 300 రూపాయలు ఉండగా దాన్ని 260 రూపాయలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా, ఏపీఎస్ ఆర్టీసీ మొదటి విడతలో భాగంగా తిరుపతికి 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది.
ఈ బస్సుల్లో 50 తిరుమల-తిరుపతికి తిరుగుతున్నాయి. 14 బస్సులు తిరుమల-రేణిగుంట మధ్య తిరుగుతున్నాయి. 12 బస్సులు తిరుపతి-నెల్లూరు మధ్య తిరుగుతున్నాయి. తిరుపతి-కడప మధ్య 12.. తిరుపతి-మదనపల్లి రూట్‌లో మరో 12 బస్సులు తిరుగుతున్నాయి. ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత అవగాహన తెచ్చేందుకు ఆర్టీసీ ఇలాంటి నిర్ణయాలు చాలానే తీసుకుంటోంది. మరి, చిత్తూరు జిల్లా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలు తగ్గించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.