iDreamPost
android-app
ios-app

ఏపీలో నిరుద్యోగుల ఆశ‌లు ఫ‌లిస్తున్న వేళ‌..

ఏపీలో నిరుద్యోగుల ఆశ‌లు ఫ‌లిస్తున్న వేళ‌..

ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఐదేళ్ల కాలం ముగియ‌డానికి కొద్దిగా ముందు సాధార‌ణంగా ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఎక్కువ‌గా వింటుంటాం. అది మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు రాజ‌కీయ పార్టీలు అనుస‌రించే ఎత్తుగ‌డ‌. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ప్ర‌భుత్వం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. అధికారం చేప‌ట్టిన మూడు నెల‌ల‌కే జ‌గ‌న్ సుమారు ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను ప్ర‌భుత్వంలో భాగ‌స్వాముల‌ను చేశారు. అంతేకాదు ఒకేసారి ల‌క్ష ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ స‌ర్కారు పొందింది.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా సాగించిన రెండేళ్ల కాలంలో భ‌ర్తీ చేసిన ఉద్యోగాల‌ను ప‌రిశీలిస్తే.. సుమారు ఆరు ల‌క్ష‌ల మందికి పైగానే నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. ఇది పెద్ద సంచ‌ల‌నంగా చెప్పుకోవ‌చ్చు. సుదీర్ఘ కాలంగా ఉద్యోగాల కోసం గ్రంథాల‌యాలు, కోచింగ్ సెంట‌ర్ల‌లోనే పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టే చాలా మంది జ‌గ‌న్ నిర్ణ‌యాల‌తో ప్ర‌స్తుతం ఉద్యోగ‌స్తులుగా మారారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండ‌ర్ ను రూపొందిస్తున్న మొట్ట మొద‌టి ప్ర‌భుత్వం కూడా ఏపీయే. ఆ త‌ర్వాత ప‌లు రాష్ట్రాలు ఏపీని అనుస‌రిస్తున్నాయి.

జాబ్ క్యాలెండ‌ర్ నిరుద్యోగుల‌కు ఉద్యోగ క‌ర‌దీపిక‌గా మారింది. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న‌ట్లు అందులో్ ప్ర‌క‌టించారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేప‌డుతున్నారు. లంచం ఇస్తేనే ఉద్యోగం అన్న ప‌రిస్థితిని మార్చేశారు. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అంతేకాకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మినిమమ్‌ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంచారు. 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.

ఇప్పుడు తాజాగా నిరుద్యోగుల‌కు మంచి న్యూస్ చెప్పింది ఏపీ. ఏపీపీఎస్సీ ద్వారా 1180 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఆయుష్, రెవెన్యూతో పాటు పలు శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అవకాశం లభించింది. గ్రూప్-1, గ్రూప్-2, రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్‌లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ ఆగష్టులో జారీ చేసే అవకాశం ఉంది.

మ‌రో ముఖ్య‌మైన‌, ఆర్థికంగా వెనుక‌బ‌డ్డ అగ్ర‌వ‌ర్ణ పేద‌ల్లోకి యువ‌త‌కు ఉప‌యోగ‌మైన నిర్ణ‌యం ఏంటంటే.. ఈ పోస్టులన్నింటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపచేయాలని జ‌గ‌న్ ప్ర‌భుత్వం పేర్కొంది. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను సైతం జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశించింది.