Idream media
Idream media
సుస్థిర పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దూసుకెళుతున్నారు. విద్యా రంగాన్ని పరిపుష్టం చేయడానికి తీవ్రంగా ప్రత్నిస్తున్నారు. ఇప్పటికే అమ్మవడి, ఫీ రేయింబర్స్ మెంట్, వసతి దీవెనతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తాజాగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిచేందుకు మైక్రోసాఫ్ట్ తో జత కట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రతిష్టాత్మక ఐటీ దిగ్గజ సంస్థ.. మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 1,62,000 మంది ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి.
గుజరాత్ వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నా.. తొలుత ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలే ప్రధాన కారణం. తాజా ఒప్పందం ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన వెంటనే చక్కటి ఉపాధి పొందే అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు 42 రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో డిజిటల్ ఎకానమీలో విజయం సాధించడానికి ఈ డిజిటల్ స్కిల్లింగ్ పునాదిలా పనిచేయనుంది.
శిక్షణ పూర్తి చేసుకున్నవారికి మైక్రోసాఫ్ట్ ఇచ్చే సర్టిఫికెట్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా సంబంధిత కోర్సుకు సంబంధించిన రంగాల్లో వెంటనే ఉద్యోగం పొందే వీలు కలుగుతుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారిలో 70 శాతం మందికి తక్షణం ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి లింక్డ్‌ఇన్ లెర్నింగ్ అందించే 8,600 కోర్సుల్లో శిక్షణ తీసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఒప్పందంలో భాగంగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి మైక్రోసాఫ్ట్ 100 అమెరికన్ డాలర్ల గిఫ్ట్ వోచర్ ఇవ్వనుంది. దీని ద్వారా మైక్రోసాఫ్ట్ అందించే ఇతర కోర్సులను నేర్చుకోవడం ద్వారా మరిన్ని నైపుణ్యాలు పెంచుకోవచ్చు.
ఈ ఒప్పందం ద్వారా మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 300కుపైగా కాలేజీల్లోని విద్యార్థులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల్లోని 1,62,000 మందికి 42 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ కింద ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 వంటి 42 రకాల సాంకేతిక నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. ఇందులో కొన్ని కోర్సుల సమయం 40 గంటలు, కొన్ని కోర్సుల నిడివి 160 గంటల వరకు ఉండనుంది