Idream media
Idream media
అనుకున్నట్లే జరిగింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిపికేషన్ జారీ అయింది. ఈ రోజు ఎస్‌ఈసీగా బాధ్యలు చేపట్టిన రోజునే నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన పోలింగ్, అవసరమైన చోట 9వ తేదీన రీ పోలింగ్, 10వ తేదీన కౌటింగ్ చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
వాస్తవానికి గత ఏడాది మార్చి 7వ తేదీన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల నుంచి అభ్యర్థుల తుది జాబితా వరకూ ప్రక్రియ పూర్తయింది. మార్చి 15వ తేదీన కరోనాను కారణంగా చూపుతూ అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేశారు.
Also Read : పరిషత్ ఎన్నికలు.. కోవిడ్ వ్యాక్సిన్.. సీఎం జగన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమదేనా..?
గత ఏడాది 660 జడ్పీటీసీలకు గాను 652 స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోను 526 స్థానాలకు ఎన్నికలకు గాను వివిధ పార్టీలు, స్వతంత్రులు 2,092 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల 354 స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. మిగతా స్థానాల్లో 2,371 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోను మిగిలిన 7,322 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు.
Also Read : పరిషత్ ఎన్నికలకు సాయంత్రం నోటిఫికేషన్..?