యూ టర్న్‌ తీసుకున్న నిమ్మగడ్డ..!

యూ టర్న్‌ తీసుకునే వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కూడా చేరిపోయారు. పంచాయతీ ఎన్నికలపై తాజాగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులో పేర్కొన్న అంశాలతో ఆయన యూ టర్న్‌ తీసుకున్నారని ప్రజలందరికీ అర్థమయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదంటూ రమేష్‌కుమార్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నిమ్మగడ్డలో వచ్చిన మార్పును గమనించిన వారందరూ అవాక్కవుతున్నారు. కేవలం 9 నెలలలో నిమ్మగడ్డ కరోనాపై తన స్టాండ్‌ను మార్చుకోవడం విశేషం. మార్చి 15వ తేదీన నామినేషన్‌ దశ దాటి సాగుతున్న స్థానిక ఎన్నికల ప్రక్రియను అప్పటి ఏపీలో లేని కరోనా వైరస్‌ను సాకుగా చూపి వాయిదా వేశారు. దాని ఫలితం కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలు అనుభవించారు. ఇప్పుడు నిమ్మగడ్డ దాని ఫలితం చవిచూస్తున్నారు. పదవి పోగొట్టుకుని కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ పార్టీల నేతలో రహస్య మంతనాలు జరిపి రాజ్యంగబద్ధమైన పదవి విశ్వసనీయతను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితిని నిమ్మగడ్డ ఎదుర్కొన్నారు.

Read Also : లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు.. అనుకున్నది జగన్‌ సాధించబోతున్నారా..?

వైరస్‌ వ్యాప్తి కాలేదని, ఏపీలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని, స్థానిక సంస్థల పాలక మండళ్లు ఏర్పాటైతే కరోనా వైరస్‌ కట్టడిని సమర్థవంతంగా చేయొచ్చని.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ససేమిరా అంటూ.. కోర్టుల్లో వాదించారు. మార్చి 29వ తేదీలోపు ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుతగిలారు. కేవలం రెండు వారాల్లో ముగిసే ప్రక్రియను అర్థంతరంగా వాయిదా వేసి తీవ్ర విమర్వలపాయ్యారు. రాజకీయ నాయకుడి మాదిరిగా, ఓ పార్టీకి కొమ్ముకాసే అధికారిగా నిమ్మగడ్డ అప్రదిష్టమూటగట్టుకోవాల్సి వచ్చింది.

కరోనా వైరస్‌ను సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ.. ఇప్పుడు అదే కరోనా ఎన్నికలకు అడ్డంకి కాదంటూ ప్రమాణ పత్రం దాఖలు చేయడాన్ని చూస్తున్న వారి ఈ పరిణామం విడ్డూరంగా కనిపిస్తోంది. మార్చిలో పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ.. ఆ లోపు ఎన్నికలను నిర్వహించాలనే లక్ష్యంతో గతాన్ని మరచిపోయినట్లు కనిపిస్తోంది. నాడు తాను చెప్పిన కారణాన్ని వదిలేసిన నిమ్మగడ్డ.. ఈ రోజు హైదరాబాద్‌లో ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్, కేరళలో స్థానిక సంస్థలు జరిగాయంటూ.. గుడ్డిగా వాదిస్తూ తన విలువను మరింతగా తగ్గించుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యూ టర్న్‌ తీసుకున్నా.. నిమ్మగడ్డ ప్రయత్నాలు సఫలం అవుతాయా..? లేదా..? అనేది కాలమే తేల్చాలి.

Read Also : రైతు ఉద్యమంపై సుప్రిం జోక్యం.. పరిస్కారం లభించబోతోందా..?

Show comments