iDreamPost
android-app
ios-app

AP హైకోర్టు సంచలన తీర్పు.. రాష్ట్రాన్ని కుదిపేసిన హైవే కిల్లింగ్‌ మున్నా గ్యాంగ్‌కు 45 ఏళ్ల శిక్ష

  • Published May 11, 2024 | 11:20 AM Updated Updated May 11, 2024 | 11:20 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన హైవే కిల్లింగ్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన హైవే కిల్లింగ్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published May 11, 2024 | 11:20 AMUpdated May 11, 2024 | 11:20 AM
AP హైకోర్టు సంచలన తీర్పు.. రాష్ట్రాన్ని కుదిపేసిన హైవే కిల్లింగ్‌ మున్నా గ్యాంగ్‌కు 45 ఏళ్ల శిక్ష

సినిమాలు చూసి నేరస్తులు ఇన్‌స్పైర్‌ అవుతారో లేక సమాజంలో జరిగిన ఘటనలను చూసే సినిమాలు తీస్తారో తెలియదు కానీ.. కొన్ని నేరాలు.. సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తాయి. నేరస్తులను పట్టుకోవడం కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు ఎలాగోలా వారిని పట్టుకుంటారు. ఇక నేటికి కూడా మన సమాజంలో కొన్ని నేరాలకు సంబంధించిన నేరస్తులను ఇంకా పట్టుకోలేకపోయారు. అదలా ఉంచితే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఒణికించిన హైవే కిల్లింగ్‌ మున్నా గ్యాంగ్‌ పేరు చెబితే జనాలు ఇప్పటికి భయపడతారు. వారు చేసిన అకృత్యాలు అలాంటివి. ఇనుము లోడ్‌తో వెళ్లే లారీ డ్రైవర్లు, క్లీనర్లను టార్గెట్‌ చేసుకుని.. వారిని హత్య చేసి.. సొత్తును దోచుకుని వెళ్లేవారు. కొన్నాళ్ల పాటు వీరి అకృత్యాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఏకంగా 13 మందిని హత్య చేశారు. ఎట్టకేలకు ఈ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఇక ఈ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నరహంతక ముఠా, హైవే కిల్లింగ్ మున్నా గ్యాంగ్‌కు ఏపీ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గతంలో ఈ కేసులో ఒంగోలు ఎనిమిదో అదనపు సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించగా.. ఏపీ హైకోర్టు.. ఈ తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. హైకోర్టులో విధించిన యావజ్జీవంలో 45 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసుల్లో దోషులకు 45 ఏళ్ల వరకు ఎలాంటి క్షమాభిక్షకు అవకాశం లేదని కోర్టు తెలిపింది.

అంతేకాదు ఈ వరుస హత్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జాతీయ రహదారిపై హత్యలకు పాల్పడుతున్న వారిని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాక ఈ దారుణాలకు బాధ్యత వహిస్తూ.. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. చనిపోయినవారికి పరిహారం ఖరారు చేసే విషయంలో ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

ఏంటీ కేసు..

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో అబ్ధుల్ సమద్ అలియాస్ మున్నా గ్యాంగ్ జాతయీ రహదారిని టార్గెట్‌ చేసుకుని నేరాలు, హత్యలకు పాల్పడేవారు. హైవేపై ఇనుప లోడుతో వెళ్లే లారీను లక్ష్యంగా చేసుకునేది ఈ ముఠా. వాహనాలును తనిఖీలు చేసే అధికారులమని చెప్పి.. ఆయా లారీ డ్రైవర్లు, క్లీనర్లను పిలిచి డాక్యుమెంట్లు చూపించాలని అడిగి.. వారిని మాటల్లో పెట్టేవాళ్లు. ఆ తర్వాత వారిని దారుణంగా హత్యచేసేవాళ్లు. అనంతరం మృతదేహాలను గోనె సంచుల్లో కట్టేసి తీసుకెళ్లి శివారు ప్రాంతాల్లో పూడ్చేసేవాళ్లు. ఆ లారీల్లోని సరుకును అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. ఆ తర్వాత లారీలను కూడా మాయం చేసేవాళ్లు.

ఈదారుణాలపై దృష్టి సారించిన పోలీసులు.. మున్నా ముఠాను అరెస్ట్‌ చేసి విచారించగా.. ఏకంగా 13మంది హత్య చేసినట్లు తేలింది. ఇక ఈ కేసులో నిందితులకు ముందుగా ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు కొందరికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవ కారాగా శిక్ష, ఒకరికి పదేళ్లు, మరొకరికి ఏడేళ్ల శిక్షలు విధించింది. ఈ మేరకు 2021 మే నెలలో తీర్పు వెల్లడించింది. అయితే ఒంగోలు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును దోషులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది.. ఈ గ్యాంగ్‌లో తొమ్మిది మందికి ఉరిశిక్ష విధించగా.. దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుల్లో ఉరిశిక్ష పడిన వారిలో ప్రధాన నిందితుడు మున్నా, బత్తుల సాల్మన్‌, షేక్‌ రియాజ్‌, చిన వీరాస్వామి, సయ్యద్‌ హిదయతుల్లాతో సహా పలువురు ఉన్నారు. వీరు ఇప్పుడు ఏకంగా 45 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss