iDreamPost
iDreamPost
చెప్పాడంటే..చేస్తాడంతే అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించిన ఏపీ సీఎం జగన్ ఆ క్రమంలోనే మరో ముందడుగు వేశారు. విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాల్లో విద్యాకానుక ఒకటి. నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మార్చేసి, అమ్మ ఒడితో తల్లిదండ్రులకు పిల్లలు భారం కాకుండా చేసి, ఇంగ్లీష్ మీడియం చదువులతో వారి ఉన్నతికి బాటలు వేస్తున్న జగన్ అందుకు తగ్గట్టుగానే విద్యాకానుక అందిస్తున్నారు. ఈ ఏడాది అదనంగా డిక్షనరీ కూడా చేర్చి ఇవ్వడం ద్వారా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషాజ్ఞానం మీద ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ అర్థమవుతుంది.
ఎవరు అగీకరించినా లేకున్నా నేటికీ నూటికి 50 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డిక్షనరీ మొఖం కూడా చూసి ఉండరు. అరకొరగా లభించే పుస్తకాలతోనే ఇన్నాళ్లుగా చదువులు సాగించారు. చివరకు విద్యాసంవత్సరం ముగింపులో కూడా పాఠ్యపుస్తకాలు అందించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అలాంటి ప్రభుత్వ విద్యను ఇప్పుడు అమాంతంగా మార్చేసేలా పాఠశాలలు తెరవడానికి ముందే సకల సదుపాయాలు కల్పించే నిర్ణయం జగన్ తీసుకున్నారు. దానిని అమలు చేస్తూ అందరికీ ఊరట కల్పిస్తున్నారు.
ఈఏడాది రూ. 789 కోట్లతో జగనన్న విద్యాకానుకను అందించారు. స్కూళ్లు తెరిచి వారం గడిచేలోగా ఈ పంపిణీ పూర్తి చేయడండ విశేషం. మొత్తం 48 లక్షలమంది పిల్లలకు ఈ విద్యాకానుక అందించారు. అంతేగాకుండా ఈనెలాఖరులోగా ప్రభుత్వ పాఠశాలలో చేరేవారందరికీ అందించేలా ఏర్పాట్లు చేశారు. అందులో భాగగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. గత సంవత్సరం అందించిన వాటికి అదనంగా ఈ ఏడాది నుంచి డిక్షనరీల పంపిణీ కూడా జరిగింది. అందులో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్ డిక్షనరీలను అందించడం విశేషం. ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు బొమ్మల నిఘంటువు అందించడం ద్వారా ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అర్థమవుతోంది.
విద్యాకానుకలో భాగంగా ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 చొప్పున నోటుపుస్తకాలు ఇస్తున్నారు. గతంలో కేవలం టెక్ట్స్ బుక్స్, అవి కూడా ఏడాదిలో ఎప్పుడో ఓ సారి ఇచ్చేవారు. దానిని పూర్తిగా మార్చేసి విద్యాసంవత్సరం ఆరంభంలో అందరికీ నోటు పుస్తకాలు సహా అనేక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చాటుతున్నారు.
Also Read : రాయలసీమ లిఫ్ట్ పనులకు అసలు కారణమదే, ఎన్జీటీకి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం