Idream media
Idream media
1, 2, 3, 4, .. ఇలా కరోనా ఎన్ని దశల్లో విజృంభించినా తట్టుకోవాలంటే.. ప్రజల్లో యాంటీబాడీలు పెంపొందాలి. కరోనా వైరస్ ను ఢీ కొట్టగలిలే బలమైన వైరస్ లు మన ఒంట్లో ఉండాలి. అందుకు వ్యాక్సినేషన్ దోహదం పడుతుంది. తక్కువ సమయంలో ఎంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయగలిగితే అంత రక్షణ. ఫలితంగా మహమ్మారి ముప్పు తగ్గుతుంది. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే వివరాలను ఏపీ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తుండడం మూలంగా.. రాష్ట్రంలోని 70 శాతం మందిలో యాండీబాడీలు అభివృద్ధి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన నాలుగో సెరో సర్వేలో తేలింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిలోనే కాకుండా, టీకాలు తీసుకోని అరవై శాతం మందిలోనూ యాంటీబాడీలు పెరిగినట్టు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 63.5 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 56.38 శాతంగా ఉంది. ఇక టీకాలు రెండు డోసులు తీసుకున్న వారిలో వైద్యులు ఆరోగ్య సిబ్బంది పోలీసులు అంగన్ వాడీ రెవెన్యూ పంచాయతీరాజ్ మునిసిపల్ శాఖ ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రజల్లో డబ్బై శాతం మందికి యాంటీబాడీలు డెవలప్ అయనట్లు తెలిసింది. ఇరవై ఒక రాష్ట్రాల్లోని డబ్బై జిల్లాల్లో జూన్ పద్నాలుగో తేదీ నుంచి జూలై ఆరు మధ్య ఈ సర్వే నిర్వహించారు.
ఏపీలోని కృష్ణా నెల్లూర్ విజయనగరాలలో సర్వే జరిగింది. దేశమొత్తంలో మధ్య ప్రదేవ్ 79 శాతం యాంటీబాడీలతో టాప్ లో ఉండగా ఆ తర్వాత కేరళ 44.4శాతం యాంటీబాడీలతో చివరి స్థానంలో ఉంది. యాంటీబాడీల స్థాయిపై నిర్వహించిన సర్వేలో ఇండియా సగటు 67శాతం. రాష్ట్రవ్యాప్తంగా 12వందల 60 బ్లడ్ శాంపుల్స్ సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటె .. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2068 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2127 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 1964117 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 1929565 కోలుకున్నట్లు తెలిపింది. మొత్తం 21198 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 13354కు పెరిగినట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు.