Idream media
Idream media
దుష్ప్రచారాలను, అసత్యాలను ప్రజలు నమ్మడం లేదు. ప్రజల కోసం ఆలోచిస్తున్నవారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో ఫలితాలే ఇందుకు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు జై కొడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అబద్దాలను వారు నమ్మడం లేదని మరోసారి రుజువైంది. ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యాత్ర పరాభావాలను మూటగట్టుకుని ముందుకు సాగుతోంది. ఎక్కడికక్కడ పుంజుకుంటుందని.. పుంజుకోవాలని.. భావించిన పార్టీ.. చతికిల పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపి స్తోంది.కీలకమైన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగరేసేలా.. ముందుకు సాగిన వైనాన్ని.. తాజా ఫలితం.. స్పష్టంగా కళ్లకు కట్టింది.
వైసీపీ అరాచకాలు చేస్తోందంటూ, జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తున్నారంటూ ఎంతలా ప్రచారం చేస్తున్న ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారు. తమకు జరుగుతున్న మేలును గుర్తు పెట్టుకుంటున్నారు. అందుకే అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారు. వరుస విజయాలను అందిస్తున్నారు. తెలుగుదేశంలో అంకితభావం లోపిస్తున్న విషయాన్ని గుర్తిస్తున్నారు. దీనికితోడు ఆ పార్టీలో అంకిత భావంతో పని చేసే నేతలు కూడా కనిపించడం లేదు. అదేసమయంలో రెండున్నరేళ్లు అయినా.. కూడా పార్టీలో ఇంకా.. గత ఓటమి తాలూకు భావాలు పోకపోవడం.. పార్టీని నడిపించే క్షేత్రస్థాయి నాయకులపై విశ్వాసం సన్నగిల్లడం.. చాలా చోట్ల అధికార పార్టీ నేతలతో టీడీపీ నేతలు తెరచాటు స్నేహాలు చేస్తూ.. కాంట్రాక్టులు దక్కించుకోవడం.. వంటివి పార్టీకి అశనిపాతంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
లేకపోతే.. వైసీపీపై వ్యతిరేకత ఉందని విపక్షాలు చేస్తున్నది ప్రచారమే అని నిరూపితమవుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేది లేదని.. ప్రభుత్వం చెప్పినా ప్రజలు పరిస్థితులను, అందుకు కారణాలను తెలుసుకుంటున్నారనే విషయం స్పష్టం అవుతోంది. అభివృద్ధి లేదని.. టీడీపీ నేతలే చెబుతున్నారు. ప్రజల మైండ్ సెట్ మారిందని అంటున్నారు. మరి దీనిని ఓట్ల రూపంలో ఎందుకు మలుచుకోలేకపోయారు. అంటే.. క్షేత్రస్థాయిలో వైసీపీ బలంగా ఉందని తెలుస్తోంది. ఏపీ అధికార పక్షం టీడీపీకి కంచుకోట వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అదేసమయంలో జిల్లాలు కూడా ఉన్నాయి. నెల్లూరు, గుంటూరు, కృష్ణాా, పశ్చిమ గోదావరి ,చిత్తూరు వంటి జిల్లాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాలుగా పేర్కొంటారు. దీంతో ఎప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగినా.. 2019 మినహా.. అంతకు ముందు వరకు టీడీపీ గెలుపు గుర్రం ఎక్కేది. అంతేకాదు.. టీడీపీ ఎవరిని ఆయా నియోజకవర్గాల్లో నిలబెట్టినా.. ప్రజలు అఖండ మెజారిటీతో విజయం సాధించేలా చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలు ప్రజలకు రుచించడం లేదు.