iDreamPost
android-app
ios-app

ఏపీ మంత్రి కుటుంబంలో కరోనా కలకలం

  • Published Jun 03, 2020 | 6:41 AM Updated Updated Jun 03, 2020 | 6:41 AM
  • Published Jun 03, 2020 | 6:41 AMUpdated Jun 03, 2020 | 6:41 AM
ఏపీ మంత్రి కుటుంబంలో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ కుటుంబంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. శంకర నారాయణ సోదరుడి కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. ఇటీవల శంకరనారాయణ మేనత్త కన్నుమూశారు. అమెకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో శంకర నారాయణ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా.. ఆయన సోదరుడు, మరో ఇద్దరికి కరోనా సోకిందని నిర్థారణ అయింది. దీంతో మిగతా కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

మంత్రి సోదరుడికి కరోనా వైరస్‌ సోకడంతో.. ఇటీవల ఆయన్ను కలసిన పార్టీ నేతలు 17 మంది వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. మంత్రి వెంట నిత్యం ఉండే ఆయన పీఏ, ఫొటో గ్రాఫర్‌తోపాటు మరో 17 మందికి పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు రావాల్సి ఉంది. పెనుగొండలో మున్సిపల్‌ సిబ్బంది మంత్రి ఇంటి వద్ద బ్లీచింగ్‌ చల్లడంతోపాటు రసాయనాలు పిచికారి చేస్తూ పరిసర ప్రాంతాలను శానిటైజ్‌ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom