Idream media
Idream media
నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపల్, నగర పంచాయతీలకు చైర్మన్లను వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఇద్దరు చొప్పన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను నియమించేందుకు వైసీపీ సర్కార్ ఆర్డినెన్స్‌ను కూడా తెచ్చింది. దీంతో మేయర్‌తోపాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, చైర్మన్ లతోపాటు ఇద్దరు వైస్ చైర్మన్లు పలుచోట్ల కొలువుతీరారు.
మొత్తం మేయర్, చైర్మన్ పోస్టులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సింహభాగం దక్కాయి. మొత్తం మేయర్లు, మున్సిపల్, నగరపంచాయతీలు 86 కాగా.. అందులో 67 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లభించాయి. 67 పదవుల్లో బీసీలకు 40, ముస్లింలకు 12, ఎస్సీలకు 13, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నేతలు ఇద్దరు మేయర్, చైర్మన్ పీఠాలపై కూర్చున్నారు. మొత్తం పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు 78 శాతం పదవులు దక్కాగా మిగిలిన 22 శాతం ( 19) పదవులు ఓసీలకు లభించాయి.
జిల్లాల వారీగా పదవులు దక్కించుకున్నవారు…
శ్రీకాకుళం జిల్లా
1. ఇచ్చాపురం – పిలక రాజ్యలక్ష్మీ
2. పలాస–కాశీబుగ్గ – గిరిబాబు
3. పాలకొండ – రాధాకుమారి
విజయనగరం జిల్లా
4. బొబ్బిలి – మురళీకృష్ణారావు
5. పార్వతీపురం – బోను గౌరీశ్వరి
6. సాలూరు – ఈశ్వరమ్మ
7. నెల్లిమర్ల – సరోజిని
విశాఖపట్నం జిల్లా
8. నర్సీపట్నం – ఆదిలక్ష్మీ
9. యలమంచిలి – రామకుమారి
తూర్పుగోదావరి జిల్లా
10. అమలాపురం – సత్యనాగేంద్రమణి
11. తుని – ఏలూరి సుధారాణి
12. పిఠాపురం – గండేపల్లి సూర్యావతి
13. సామర్ల కోట – గంగిరెడ్డి దేవి
14. మండపేట – దుర్గారాణి
15. రామచంద్రపురం – శ్రీదేవి
16. పెద్దాపురం – బొడ్డు తులసి
17. ఏలేశ్వరం – అలమంద సత్యవతి
18. గొల్లప్రోలు – మంగతాయారు
19. ముమ్మిడివరం – ప్రవీణ్‌కుమార్
పశ్చిమ గోదావరి జిల్లా
20. నర్సాపురం – కొత్తపల్లి భుజంగరావు
21. నిడదవోలు – ఆదినారాయణ
22. కొవ్వూరు – రత్నకుమారి
23. జంగారెడ్డి గూడెం – బత్తిన లక్ష్మీ
కృష్ణా జిల్లా
24. నూజివీడు – త్రివేణి దుర్గా
25. పెడన – బి.జ్ఞానలింగజ్యోతి
26. ఉయ్యూరు – వల్లభనేని సత్యనారాయణ
27. నందిగామ – మండవ వరలక్ష్మీ
28. తిరువూరు – కస్తూరిభాయి
గుంటూరు జిల్లా
29. తెనాలి – ఖలీదా
30. చిలకలూరిపేట – షేక్ రఫాని
31. రేపల్లె – కట్టా మంగమ్మ
32. మాచర్ల – తురక కిశోర్
33. సత్తెనపల్లి – లక్ష్మీ తులసి
34. వినుకొండ – దస్తగిరి
35. పిడుగురాళ్ల – చిన్న సుబ్బారావు
ప్రకాశం జిల్లా
36. చీరాల – జి.శ్రీనివాసరావు
37. మార్కాపురం – మురళీకృష్ణారావు
38. అద్దంకి – ఎస్తేరమ్మ
39. చీమకుర్తి – చల్లా అంకులు
40. గిద్దలూరు – వెంకట సుబ్బయ్య
41. కనిగిరి – అబ్దుల్ గఫార్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
42. వెంకటగిరి – నక్కా భానుప్రియ
43. ఆత్మకూరు – వెంకట రమణమ్మ
44. సూళ్లూరుపేట – శ్రీమంత్ రెడ్డి
45. నాయుడుపేట – దీపిక
అనంతపురం జిల్లా
46. హిందూపురం – ఇంద్రజ
47. గుంతకల్లు – ఎస్.భవానీ
48. తాడిపత్రి – జేసీ ప్రభాకర్ రెడ్డి
49. ధర్మవరం – నిర్మల
50. కదిరి – నజి మున్నీసా
51. రాయదుర్గం – శిల్ప
52. గుత్తి – వన్నూరుబీ
53. కళ్యాణదుర్గం – రాజ్‌కుమార్
54. పుట్టపర్తి – ఓబులపతి
55. మడకశిర – లక్ష్మీ నరసమ్మ
కర్నూలు జిల్లా
56. ఆదోని – శాంత
57. నంద్యాల – షేక్ మబున్ని
58. ఎమ్మిగనూరు – శివన్న రఘు
59. డోన్ – గంటా రాజేష్
60. నందికొట్కూరు – సుధాకర్ రెడ్డి
61. గూడూరు – వెంకటేశ్వర్లు
62. ఆళ్లగడ్డ – రామలింగారెడ్డి
63. ఆత్మకూరు – ఆసియా
వైఎస్సార్ జిల్లా
64. ప్రొద్దుటూరు – లక్ష్మీ దేవీ
65. పులివెందుల – వర ప్రసాద్
66. జమ్మలమడుగు – శివమ్మ
67. బద్వేలు – రాజగోపాల్ రెడ్డి
68. రాయచోటి – షేక్ బాషా
69. మైదుకూరు – మాచనూరు చంద్ర
70. ఎర్రగుంట్ల – హర్షవర్థన్ రెడ్డి
చిత్తూరు జిల్లా
71. మదనపల్లె – మనుజ
72. పుంగనూరు – ఆలీమ్ బాషా
73. పలమనేరు – పవిత్ర
74. నగరి – నీలమంగళం
75. పుత్తూరు – హరి
కార్పొరేషన్ల మేయర్లు…
1. విజయనగరం – వెంపటాపు విజయలక్ష్మీ
2. విశాఖపట్నం – గొలగాని హరి వెంకటకుమారి
3. విజయవాడ – భాగ్యలక్ష్మీ డిప్యూటీ మేయర్లు:
4. మచిలీపట్నం – మోకా వెంకటేశ్వరమ్మ
5. గుంటూరు – కావటి మనోహర్‌నాయుడు
6. ఒంగోలు – గంగాడ సుజాత
7. తిరుపతి – డాక్టర్ శిరీష్
8. చిత్తూరు – ఎస్.అముద
9. అనంతపురం – వసీం సలీమ్
10. కడప – సురేష్‌బాబు
11. కర్నూలు – బీవై రామయ్య
Also Read : టీడీపీదే తాడిపత్రి.. మరోసారి చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి