సియం సహాయనిధికి ఐ.ఏ.యస్ అధికారుల విరాళం

కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అండగా ఇప్పటికే రాష్ట్రంలో సినిమా ఆర్టిస్ట్ లు, వ్యాపారవేత్తలు, పలు రాజకీయ పార్టీల నాయకులు , ప్రజా ప్రతినిదులు, ఉద్యోగులు తమ వంతు విరాళం ప్రకటించారు ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండేందులు ఐ.ఏ.యస్ ఆఫీసర్లు అడుగు ముందుకు వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉంటామని విరాళం ప్రకటించారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 162 మంది ఐ.ఏ.యస్ అధికారులు తమ మూడు రోజుల వేతనం 20 లక్షల రూపాయలను సియం సహాయనిధికి ఇస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు ఐ.ఏ.యస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. తమ జీతాల నుండి ఆ మొత్తాన్ని మినహాయించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు వెళ్ళడించారు.

Show comments