Idream media
Idream media
మహిళా అధికారినిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తప్పించుకున్నారు. తనపై నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయ్యన్న దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అయ్యన్నను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు రోజులకు వాయిదా వేసింది.
నర్సీపట్నం మున్సిపల్ మహిళా కమిషనర్‌ను బట్టలూడదీసి కొడతానని అయ్యన్నపాత్రుడు ఓ సందర్భంలో అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మరమత్తులు చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఫొటోలను అధికారులు తీశారు. ఆయా ఫొటోలలో అయ్యన్న తాత ఫొటో కూడా ఉంది. ఈ విషయంపై మహిళా కమిషనర్‌ను ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పారు. అయినా అంతటితో ఆగని ఆయ్యన్న తిరిగి ఫోటో పెట్టకపోతే బట్టలూడదీసి కొడతానని అన్నారు.
అవమాకర రీతిలో అందరి ముందు అయ్యన్న మాట్లాడడంతో సదరు మహిళా అధికారి నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయ్యన్న పాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయ్యన్న అరెస్ట్ కావడం తధ్యం అనే ప్రచారం సాగుతున్న క్రమంలో ముందుగానే అయ్యన్న అప్రమత్తమయ్యారు. హైకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత ఏమి జరుగుతుందో వేచి చూడాలి.