iDreamPost
android-app
ios-app

ఏకగ్రీవాలలో ట్రెండ్ సెట్ చేసిన జ‌గ‌న్ స‌ర్కార్

ఏకగ్రీవాలలో ట్రెండ్ సెట్ చేసిన జ‌గ‌న్ స‌ర్కార్

ప‌ద‌వి అంటే చాలు.. అది చిన్న‌దైనా, పెద్ద‌దైనా అన్ని పార్టీల నుంచీ నేత‌లు ఎగ‌బ‌డ‌తారు. పోటీకి సై అంటే సై అంటారు. పార్టీల వారీగా, స్వ‌తంత్రంగా.. ఇలా పోటీలో లెక్క‌కు మించే ఉంటారు. కానీ ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కొత్త ట్రెండ్ మొద‌లైంది. ప్ర‌భుత్వ ప్ర‌చారం, కృషి కార‌ణంగా రికార్డు స్థాయిలో ఏక‌గ్రీవాలయ్యాయి. గ్రామాల్లో స‌హృద‌య వాతావ‌ర‌ణం కోసం, ప్ర‌జ‌ల మ‌ధ్య ప‌ద‌వులు చిచ్చు పెట్ట‌కుండా ఉండ‌డం కోసం ఎన్నిక‌ల‌కు ముందే జగన్ సర్కార్ ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా నజరానాలను ప్రకటించింది.

జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీల‌న్నింటినీ ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఈ కేటగిరీ ప్రకారం.. జనాభా రెండు వేల లోపు ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించితే.. ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల నజరానాను ప్ర‌క‌టించింది. రెండు వేల నుంచి అయిదు వేల లోపు జనాభా ఉండే పంచాయతీల్లో ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికను నిర్వహించితే.. 10 లక్షల రూపాయల రివార్డ్ అందిస్తామంది. అయిదు వేల నుంచి ప‌ది వేల వరకు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగితే 15 లక్షల రూపాయలు, ప‌ది వేల జనాభా కు పైగా ఉన్న గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించితే.. 20 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం అందజేస్తుంద‌ని పేర్కొంది.

Also Read : బాబూ..మీకు అర్థమవుతోందా.. ఏపీ అప్పులపై కేంద్రం సానుకూల స్పందన

గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే అవాంఛనీయ సంఘటనలను నివారించడంతో పాటు జాతిపిత మహాత్మాగాంధీ, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి ఇది తొలి అడుగుగా ప్ర‌భుత్వం ప్ర‌చారం చేసింది. ప్ర‌భుత్వ కృషి ఫ‌లించింది. గత మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికల సమరంలో చాలా గ్రామాలు ఆదర్శంగా నిలచాయి. పోటీకి స్వస్థి పలికి.. ఏకగ్రీవాలవైపు మొగ్గు చూపాయి. ఇలా ఒకటి రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ గ్రామ పంచాయతీ సర్పంచ్లు వార్డు సభ్యుల విషయంలో సరికొత్త ట్రెండ్ నమోదైంది. తాజాగా పంచాయతిరాజ్ శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 2199 సర్పంచులు 48022 వార్డు సభ్యుల ఏకగ్రీవం కావడం.. గ్రామ రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్ను స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో అత్యధికంగా మత్స్యకార కుటుంబాలే నివశిస్తుంటాయి. ఆ గ్రామంలో దాదాపు 19 వేల జనాభా ఉంది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉండే 18 వార్డు సభ్యులతో పాటు సర్పంచి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఇలా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పట్టింది. పదివేలకుపైగా జనాభా ఉండే 11 పెద్ద గ్రామాల్లో సైతం ప్రజలు ఒకే పక్షా న ఉంటూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మొత్తం వార్డు సభ్యులతోపాటు సర్పంచిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఇది కూడా ఎలాంటివివాదాలకు తావులేకుండా సాగిపోవడం గమనార్హం.

రాష్ట్రంలో మొత్తం 13095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2199 సర్పంచి పదవులకు 48022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో సర్పంచి వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీ వంగా ఎన్నికలు ముగిశాయి. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువశాతం పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంతేకాదు రెండు వేలు అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అత్యధికంగా సర్పంచి వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. రెండు వేలు అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో 1401 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు నిర్ధారించారు. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ తరహా ఫలితం రావడం.. ఇలా అన్నీ ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read : అక్కడ విలవిల .. ఇక్కడ కళకళ .. ఇంతలో ఎంత మార్పు..?