Idream media
Idream media
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవడం లోను, అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా.. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం లోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో నిలుస్తోంది. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభానికి అన్ని రాష్ట్రాల్లోనూ మెజార్టీ కుటుంబాలు చిన్నాభిన్నం అయితే.. ఏపీ వాసులను నగదు బదిలీ భారీగా ఆకట్టుకుంది. అప్పుల పాలు కాకుండా కాపాడింది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చేయడంలో జగన్ సర్కార్ దేశంలోనే గుర్తింపు పొందింది. నగదు బదిలీయే కాదు.. విపత్తులు, విధ్వంసాల సమయంలో పెద్దగా నష్టం వాటిల్లకుండా సంచలన నిర్ణయాలకు కేరాఫ్ గా ఏపీ నిలిచింది. ఈ క్రమంలోనే కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
Read Also:- చంద్రబాబు మరో పాదయాత్ర ?
సొంత ఊరి నుంచే ఉద్యోగులు పని చేసుకునేలా దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సరికొత్త ప్రణాళికలు వేస్తోంది. ఉద్యోగులు తమ సొంత ఊరి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని కంపెనీలకు కల్పిస్తూ దేశంలోనే తొలిసారిగా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాల్లో 25 డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇటీవలే తెలిపారు. ఉద్యోగులు వారి సొంత ఊళ్ల నుంచే పని చేసుకునేలా.. 30 మంది కూర్చునే విధంగా కోవర్కింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 30 డెస్క్‌టాప్‌లు, హైస్పీడ్ ఇంటర్‌నెట్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, డేటా భద్రత వంటి అన్ని వసతులతో కోవర్కింగ్ స్టేషన్లు ఉండనున్నాయి.
Read Also:- బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జనసేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కారణాలున్నాయా?
కంపెనీలకు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ విధానాన్ని మూడు దశల్లో అమలు చేయడానికి ఐటీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నిర్వహణ వ్యయం తగ్గించుకునేలా అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి, ఇన్నోవేషన్ సొసైటీ, ఇంజనీరింగ్ కళాశాలలు, గ్రామ డిజిటల్ లైబ్రరీలు, ఏపీఐఐసీ భవనాలను వినియోగించుకోనున్నారు. వర్క్ స్టేషన్లకు అవసరమైన భవనాలను ఇప్పటికే ఏపీఎస్‌ఎన్డీసీ గుర్తించగా.. మూడు దశల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లను నెలకొల్పేందుకు ఐటీశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. వాటికయ్యే వ్యయం, స్పేస్, ఒక్కో ఉద్యోగి, వర్క్ స్టేషన్‌కి అయ్యే ఖర్చులపై ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది.
Read Also:- రైతుల పై దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు , 8 మంది మృతి
కాస్ట్ టు కాస్ట్ విధానంలో వీటిని అమలు చేయడం ద్వారా అటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఉద్యోగులకు సరైన స్పేస్ దొరకనుంది. ఏపీఎస్‌ఎన్డీసీ నెలకొల్పిన ఎక్సలెన్స్ సెంటర్లు, ఈఎస్‌సీ సెంటర్లను కోవర్కింగ్ స్టేషన్లుగా వినియోగించుకునేందుకు వారికి అవకాశం కల్పించనుంది. కాకినాడ, విశాఖలోని ఏపీ ఇన్నోవేషన్ సెంటర్లు, విలేజ్ డిజిటల్ సెంటర్లు, ఇంజినీరింగ్ కాలేజీలు., కోవర్కింగ్ స్టేషన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు, వర్కింగ్ స్టేషన్లుగా జిల్లాలలోని ఏపీఐఐసీ భవనాలు, ఈఎస్‌సీలను మలుచుకునే దిశగా మ్యాపింగ్ చేయాలని మంత్రి మేకపాటి అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంపై ప్రైవేటు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.