iDreamPost
android-app
ios-app

పేద బ్రాహ్మణులకు జగన్ సర్కార్ అండ.. ఏప్రిల్ నుంచి సరికొత్త పథకం ..

పేద బ్రాహ్మణులకు జగన్ సర్కార్ అండ.. ఏప్రిల్ నుంచి సరికొత్త పథకం ..

 ఆంధ్రప్రదేశ్ లో వినూత్న పథకాలతో సీఎం వైఎస్ జగన్ సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. జెట్ స్పీడ్ తో పధకాలు ప్రకటిస్తూ.. అమలు చేస్తున్నారు. నవరత్నాలతో పాటూ కొత్త పధకాలు ప్రకటిస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు చేయూతనిస్తున్నారు. తాజాగా పేద బ్రాహ్మణుల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చారు.

పేద కుటుంబాల్లో ఉపనయనం (ఒడుగు) చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 7–16 ఏళ్ల మధ్య వయసున్న వారు ఉపనయనం చేసుకుంటే కార్పొరేషన్ ద్వారా ఆర్ధిక సాయం అందజేస్తారు.

ఇప్పటికే జగన్ సర్కార్ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా భారతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు సాయం అందజేస్తున్నారు. రేపు ఫిబ్రవరి 29 వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. కార్పొరేషన్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఏడాదికి రూ.6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఓ విడత ఆర్థిక సహాయం పొందిన వారు అనర్హులు.. అలాగే కనీసం ఏడాది పాటూ మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు మాత్రమే అర్హులుగా నిర్ణయించారు.