iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయమే ఆయనకు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో యంత్రాంగం అప్రమత్తమయ్యింది. హుటాహుటీన హైదరాబాద్ కి తరలించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి, అక్కడి గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని సమాచారం.
ఇటీవల హరిచందన్ విశ్వభూషణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్రం పెద్దలతో చర్చలు జరిపారు. గవర్నర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రయాణ బడలికతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన కొంత నలత గా ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హైదరాబాద్ కి తరలించారు. అక్కడే చికిత్స అందించబోతున్నారు.
రేపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన త్వరగా కోలుకుంటారని అంతా భావిస్తున్నారు. త్వరలోనే మళ్లీ ఏపీ రాజ్ భవన్ కి ఆయన చేరుకుంటారని చెబుతున్నారు.