Idream media
Idream media
ఆంద్రప్రదేశ్‌లో రేపటితో 2019-20 విద్యా సంవత్సరం ముగుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే వార్షిక పరీక్షల నిర్వహణ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధ్యపడలేదు. కానీ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మే 3 వరకు సెలవులను పొడగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు, పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఒక సర్య్యూలర్ జారీ చేశారు.
మే నెల 3వ తేదీ తరువాత పరిస్థితిని సమీక్షించి పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయానికి వస్తామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పదో తరగతి మినహా అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ గతంలోనే ఏపీ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా 10 వ తరగతి విద్యార్థులు విలువైన సమయం నష్టపోకూడదని దూరదర్శన్ సప్తగిరి చానెల్ ద్వారా “విద్యామృతం” ప్రోగ్రాం పేరిట విద్యాశాఖ పాఠాలను ప్రచారం చేస్తుంది. అలాగే నేటి నుంచి మే 15 వరకు రేడియోలో కూడా రోజు ఉదయం 11.05 నుంచి 11.35 వరకు పదో తరగతి పాఠాల బోధన పరీక్షల సంసిద్ధతపై కార్యక్రమాల ప్రచారం పాఠశాల విద్యాశాఖ మొదలు పెట్టింది.
ఏపీలో కరోనా అదుపులోకి వస్తే మే చివరి వారంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. రంజాన్ పండుగ ముగిసిన వెంటనే కేవలం ఐదారు రోజులలో ఒక సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లను ఒకే రోజు నిర్వహించాలని SSC బోర్డు నిర్ణయించింది అంటున్నారు. ప్రతిరోజు రెండు పూటలా పరీక్షలు నిర్వహించి నెలాఖరుకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ని పూర్తి చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడుతున్నాయి.