iDreamPost
android-app
ios-app

సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ బదిలీ

సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను ఢిల్లీలో ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్‌ అధికారిణి భావన సక్సేనాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. ప్రవీణ్‌ ప్రకాశ్, భావన సక్సేనా దంపతులు. గత ప్రభుత్వం లోనూ వారిరువురు ఏపీ భవన్ లో విధులు నిర్వహించారు. 

ఆంధప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు మూడేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. సీఎం వైఎస్‌ జగన్‌ నమ్మకాన్ని గెలుచుకునేలా పని చేశారు. క్లిష్ట సమయాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.