Idream media
Idream media
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండో రోజు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన రహదారుల నిర్మాణం, రహదారుల విస్తరణ అంశాలపై సీఎం వైఎస్ జగన్.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి, మార్గాని భరత్ రామ్‌లు ఉన్నారు.
కాగా, మొదటి రోజు సోమవారం సీఎం జగన్ మొదట ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. వివిధ అంశాలను వారి ముందు పెట్టారు.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం, ఖర్చు చేసిన నిధుల రీయంబర్స్‌మెంట్, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయలు, ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం రుణ పరిమితికి అవకాశం.. వంటి అంశాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. వాటితోపాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్న తీరును ప్రధానికి వివరించారు.
Also Read : ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ