Draupadi murmu president candidate ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు.. సీఎం జగన్‌

మంగళగిరి, సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు.

మంగళగిరి, సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు.

సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును ప్ర‌థ‌మ పౌరునిగా ఎన్నుకోవాల్సిన‌ అవసరం ఉందని సీఎం జ‌గ‌న్ అభిప్రాయపడ్డారు. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా, ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్‌ కోరారు. మంగళగిరి, సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సీఎం జ‌గ‌న్ ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాల’ని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను సీఎం జగన్‌ కోరారు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కొన్ని ఓట్లు చెల్ల‌డం లేదు. ఈ ప‌రిస్థితి రాకుండా, ఒక్క ఓటు కూడా వృథా కాకుండా, జులై 18న మాక్‌ పోలింగ్ హాజ‌రై, ఆ తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సీఎం సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారు. అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల‌ని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఆ త‌ర్వాత‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ముర్ముకు పరిచయం చేశారు సీఎం జగన్‌.

ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, తెలుగులో ప్రసంగం ఆరంభించారు. వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్‌ నిలయం. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారంటూ, తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు.

అనంతరం రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరారు ద్రౌపది ముర్ము.

Show comments