Idream media
Idream media
ప్రజల ఆశలు, ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో మొదటి నుంచి ముందుంటున్న జగన్ సర్కార్ ఇప్పుడు కూడా అదే పంథా అవలంబించింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ జనగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ బీసీల అభ్యున్నతికి అరుదైన ఆలోచనలు చేస్తూనే ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 56 బీసీ ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. కార్పొరేషన్లు ఏర్పాటుతో పాటు పదవులు ఇచ్చి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. జనగణనకు ముందే నామినేటెడ్, ఇతర పదవుల్లో జనాభా ప్రాతిపదికన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి
ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల హామీల్లో భాగంగా బీసీల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పిన జగన్ ఆమేరకు కృషి చేస్తున్నారు. బీసీలంటే వెనుకబడిన తరగతుల వారు కాదని, ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచేవారని కొత్త భాష్యం చెబుతూ తొలి బడ్జెట్‌లోనే ఊహించని రీతిలో నిధులు కేటాయించారు. ఎన్నికలు వస్తాయి, పోతాయి. ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారు. హామీలు మాత్రం గాల్లో కలిసిపోతాయి. అయితే బీసీల విషయంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేందుకు సన్నద్ధమవుతున్నారు జగన్. ఆ క్రమంలో బీసీలకు ఏటా 15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు గాను 75వేల కోట్ల రూపాయలు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తున్నారు. బీసీల ఆర్థికాభివృద్ధికి వైఎస్‌ఆర్ చేయూత అమలు చేస్తున్నారు.
Also Read : దేశ వ్యాప్త డిమాండ్BC Census – బీసీ జనగణన చంద్రబాబు మొదలెట్టేశారు, క్రెడిట్ గేమ్ లో కొత్త స్కెచ్
దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు తీయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరుసార్లు తీసిన జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయలేదు. కానీ, ఈసారి కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అన్ని పార్టీలు, బీసీ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నాయి. సరైన సమాచారం లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో జనగణనపై ఏళ్ల తరబడి డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
ఎందుకు గణన..
జనాభా ప్రాతిపదిన రిజర్వేషన్ ఫలాలు అందాలనేది పలు బీసీ సంఘాల వాదన. బీసీ గణన చేయడం వల్ల ఎంతశాతం ఉన్నారు అనే వివరాలు తెలిసి వారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సంక్షేమ ఫలాలు అందించడం వీలవుతుందని బీసీ సంఘాలు కోరుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీసీ జనాభా లెక్కలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జనగణనలో కులాల వారీ లెక్కలు తీయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం 2006లో కేంద్రానికి లేఖ రాసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా కులాల వారీగా జనాభా లెక్కలు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దాదాపు అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించగా బీసీ జనాభా 52 శాతం ఉన్నట్టు తేలింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీ జనగణన అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Also Read : MLC Elections,Cabinet Reshuffle-వచ్చే నెలాఖరులోనే క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం