iDreamPost
android-app
ios-app

AP Assembly Second Day – రెండో రోజు అసెంబ్లీ.. టీడీపీ, వైసీపీ మధ్య పేలిన మాటల తూటాలు

AP Assembly Second Day – రెండో రోజు అసెంబ్లీ.. టీడీపీ, వైసీపీ మధ్య పేలిన మాటల తూటాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు వాతావరణం కాస్త వేడెక్కింది. విపక్షం వివాదాస్పద వ్యాఖ్యలతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. రైతు సంక్షేమం, వ్యవసాయంపై అసెంబ్లీ లో వాడీ వేడి చర్చ జరిగింది. చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ అంటూ టీడీపీ నేతలు సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ తీరులోనే మంత్రి కొడాలి నానీ సమాధానం ఇచ్చారు. చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదని మంత్రి కొడాలి నాని తన శైలిలో సమాధానం ఇచ్చారు.

వ్యవసాయంపై చర్చ తో పాటు మరికొన్ని అంశాలపై కూడా తాను సిద్దంగా ఉన్నా అంటూ చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ సమయంలో మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుని టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పార్టీ లేదు బొక్కా లేదన్న ఓ పార్టీ అధ్యక్షుడ్ని తొలిసారి చూస్తున్నామని మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతోన్న సందర్భంలో అచ్చెన్నాయుడు అడ్డు తగిలే ప్రయత్నం చేసారు. కుప్పం మా లెక్కలోకే లేదని అచ్చెన్నాయుడు గురించి ఇంకేం మాట్లాడగలమంటూ కన్నబాబు చలోక్తులు విసిరారు.

ఇక గతంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ప్రస్తావించే ప్రయత్నం చేసినా కన్నబాబు మాత్రం టీడీపీకి అవకాశం ఇవ్వలేదు. మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకున్న చంద్రబాబు కుప్పం ఓటమిని తట్టుకోలేరా అంటూ కన్నబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక రైతుల అంశం గురించి మాట్లాడిన కన్నబాబు… మాకు రైతులు అంటే పంట‌లు పండించే వారు రైతులని టీడీపీ వారికి రైతులు అంటే అమ‌రావ‌తి భూములు వ్యాపారం చేసే వారు రైతులు అంటూ వ్యాఖ్యలు చేసారు. ఎంత‌ దాచుకుందామ‌నుకున్నా టిడీపీ కి అమ‌రావ‌తి పై ప్రేమను దాచుకోలేరు అని ఆయన ఎద్దేవా చేసారు.

మాకు రైతులు అంటే అమ‌రావ‌తిలోని రియ‌ల్ ఎస్టేట్ రైతులు కాదు అని అన్నారు. ఇక టీడీపీ చేసే వ్యాఖ్యల విషయంలో అధికార పార్టీ గట్టి సమాధానం ఇవ్వడంతో చేసేది లేక సభ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. ఇక టీడీపీ నుంచి అచ్చేన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న సమయంలో ఇతర టీడీపీ నేతల నుంచి స్పందన కరువైంది. దీనితో మంత్రులు ఇచ్చే కౌంటర్లకు టీడీపీ సరైన సమాధానం చెప్పలేకపోయింది.

Also Read : BAC Meeting – బాబుని చూడాలి, పెద్దవారు అచ్చెన్న గారు: జగన్ చలోక్తులు