iDreamPost
android-app
ios-app

AP, Odisha, Joint Committee – సమస్యల పరిష్కారానికి ఏపీ, ఒడిశా సీఎంల కీలక నిర్ణయం

AP, Odisha, Joint Committee – సమస్యల పరిష్కారానికి ఏపీ, ఒడిశా సీఎంల కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్ధాల నుంచి కొనసాగుతున్న వివాదాలు, సమస్యల పరిష్కారం వైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం జాయింట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ కమిటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతోపాటు ఇతర అధికారులు ఉండనున్నారు.

ఒడిశాతో ఉన్న జల వివాదాలు, కొఠియా గ్రామాల సమస్యల పరిష్కారం కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో చర్చించేందుకు ఈ రోజు భువనేశ్వర్‌ వెళ్లారు. సాయంత్రం భువనేశ్వర్‌ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, ఝంజావతి నదిపై కాంక్రీట్‌ డ్యాం, కొఠియా గ్రామాలలో తరచూ చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఒడిశా సీఎం నవీన్‌తో చర్చించారు. వివాదాలు, సమస్యల పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంసిద్ధతతో ఉండడంతో.. జాయింట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

Also Read : Jagan Naveen Patnaik – సీఎం జగన్ ఒడిశా పర్యటన – జల వివాదాలు, సరిహద్దు సమస్యల పరిష్కారమే లక్ష్యం