Idream media
Idream media
కేంద్రంలోనైనా, రాష్ట్రాలలోనైనా ప్రభుత్వాల పరిపాలనను మీడియా, ప్రజలు, రాజకీయ నేతలు గత ప్రభుత్వాలతో పోల్చి బేరీజు వేస్తుంటారు. పక్కపక్కనే ఉన్న రెరండు రాష్ట్ర ప్రభుత్వాల పాలనను పోల్చి తమదైన విశ్లేషణలను సాగిస్తుంటారు. నిన్న అధికారంలో ఉన్న పార్టీ నేడు ప్రతిపక్షంలో ఉంటే.. ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తాము అలా చేశాం.. ఇలా చేశాం.. అని చెబుతుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతానికి భిన్నంగా ఓ పోలిక చెప్పి రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించారనుకోవచ్చు.
వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలోనే వివిధ పథకాల ద్వారా ప్రజలకు లక్ష కోట్ల రూపాయలను అందించింది. ఈ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఇంతే మొత్తం టీడీపీ ప్రభుత్వం అందించి ఉంటే.. వారి నేతలకు కమీషన్ల రూపంలో 30 వేల కోట్ల రూపాయలు చేరేవన్నారు. దీనికి కొనసాగింపుగా టీడీపీ ప్రభుత్వ హాయంలో జన్మభూమి కమిటీలు సాగించిన నిర్వాకాలను గుర్తు చేశారు సజ్జల. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా సదరు పోలిక వైసీపీ పాలనను తెలియజేస్తూనే.. అదే సమయంలో టీడీపీ తీరున ఎండగట్టేలా ఉండడం విశేషం.
Also Read : కొడాలి నానికి ధీటైన నాయకుడే దొరకడం లేదా?
ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఫలితంగా మేనిఫెస్టోలో ఉన్న పథకాలు మొదటి ఏడాది నుంచే కార్యరూపం దాల్చుకున్నాయి. రెండేళ్లలో దాదాపు 25 సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన వారికి లక్ష కోట్ల రూపాయలు నేరుగా అందాయి. ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ప్రజలు, వారికి వారధులుగా వాలంటీర్లు పథకాలను అర్హులైన వారికి అందజేస్తున్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు ఇస్తుండడంతో వైసీపీ ప్రభుత్వానికి ఏనలేనిపేరు వచ్చింది.
ఆయా పథకాలు అమలు చేసే రోజున టీడీపీ అనుకూల మీడియాలో ఆ పథకం విశిష్టతను తగ్గించేందుకు.. టీడీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన పథకానికే పేరు మార్చారనో, ఇంత మంది జనాభా ఉంటే.. ఇంతే మందికి ఇస్తున్నారనో, కొర్రీలు వేస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారనో కథనాలు వచ్చేవి. పథకం అమలైన మరుసటి నిమిషమే టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి తమ అనుకూల మీడియలో వచ్చిన అంశాలనే చెబుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు తప్పితే.. పథకాలపై అవినీతి అరోపణలు టీడీపీ గానీ, ఆ పార్టీ అనుకూల మీడియా గానీ చేయకపోవడం జగన్ సర్కార్ ఎంత పకడ్బంధీగా సులువైన రీతిలో నేరుగా ప్రజలకు పథకాల ఫలాలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : అక్కడ విలవిల .. ఇక్కడ కళకళ .. ఇంతలో ఎంత మార్పు..?