iDreamPost
iDreamPost
హైదరాబాద్ లో మహిళలు, బాలికలు, యువతులపై రోజురోజుకూ అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో అత్యాచారాలకు గురైన బాలికల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా నగరంలో జరిగిన మరో దారుణం బయటికొచ్చింది. కార్ఖానా పరిధిలో ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ధీరజ్, రితేశ్ అనే యువకులు బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో పరిచయమయ్యారు. క్రమంగా మాటలు కలిపి చనువు పెంచుకున్నారు. బాలికపై ఇద్దరూ అత్యాచారం చేసి.. అదంతా వీడియో తీశారు. తర్వాత ఆ వీడియోలను బాలికకు పంపి బెదిరింపులకు తెరలేపారు. బాధితురాలు తన వీడియోలు తనకివ్వాలని అడగ్గా.. తమ స్నేహితుల కోరిక కూడా తీర్చాలని డిమాండ్ చేశారు.
బాలికకు వేరే దారిలేక వారి షరతుకు ఒప్పుకుంది. ముగ్గురు యువకులతో పాటు.. ధీరజ్, రితేశ్ లు కూడా బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో బాలిక మానసికంగా కుంగిపోవడంతో.. కుటుంబసభ్యులు సైకియార్టిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలిక తనకు జరిగిందంతా వివరిచడంతో.. అది తెలిసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. మే 30న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నలుగురు యువకులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించారు.
కాగా.. బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదంటున్నారు పోలీసులు. స్నేహం పేరుతో బాలికతో పరిచయం పెంచుకున్న యువకులు.. తమ లైంగిక వాంఛను తీర్చుకున్నారని, బాలికపైలాడ్జిలో వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఇది సామూహిక అత్యాచారం కాదని చెప్తున్నారు.