iDreamPost
android-app
ios-app

బెయిల్‌పై వచ్చి గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మ‌ళ్లీ అత్యాచారం, ఫ్రెండ్ తో వీడియో.

  • Published Aug 03, 2022 | 5:56 PM Updated Updated Aug 03, 2022 | 6:10 PM
  • Published Aug 03, 2022 | 5:56 PMUpdated Aug 03, 2022 | 6:10 PM
బెయిల్‌పై వచ్చి గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మ‌ళ్లీ అత్యాచారం, ఫ్రెండ్ తో వీడియో.

అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 24 ఏళ్ల వ్య‌క్తి, బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. స్నేహితుడితో కలిసి మళ్లీ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తీశాడు. పెట్టిన కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని బెదిరించాడు.

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలి వ‌య‌స్సు ఇప్పుడు 19 . 2020లో త‌న‌పై అత్యాచారం చేసిన వ్య‌క్తిని మీద ఫిర్యాదుచేసింది. పోస్కో చ‌ట్టం ప్ర‌కారం అత‌నిమీద కోర్టు శిక్ష విధించింది. ఆత‌ర్వాత బెయిల్ మీద బైట‌కు రావ‌డానికి ముందు, యేడాది పాటు జైల్లోనే ఉన్నాడు. బెయిల్ మీద వ‌చ్చిన త‌ర్వాత‌, ఇంట్లో బాధితురాలు ఒంటరిగా ఉన్న టైంలో కత్తితో బెదిరించి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత‌ని స్నేహితుడు ఈ దారుణాన్ని వీడియో తీశాడు.

2020నాటి కేసును క‌నుక వెన‌క్కితీసుకోక‌పోతే సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాన‌ని బెదిరిస్తున్నాడు. ఈ దారుణంపై బాధితురాలు నెల క్రితం కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio