అన్నాబెల్లె సేతుపతి రిపోర్ట్

నిన్న ఇటు బాక్సాఫీస్ వద్ద అటు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోనూ కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లతో గట్టి సందడి నెలకొంది. మన దృష్టి ఎక్కువగా గల్లీ రౌడీ మీదకు వెళ్లిపోయింది కానీ దాని ఫలితం తెలిశాక మెల్లగా వేరే ఆప్షన్స్ వైపు కన్నేశారు ఆడియన్స్. అందులో ఒకటి అన్నాబెల్లె సేతుపతి. డిస్నీ హాట్ స్టార్ లో తెలుగుతో సహా మల్టీ లాంగ్వేజ్ లో దీన్ని స్ట్రీమింగ్ చేశారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సురేఖావాణి లాంటి టాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఉండటంతో మన ప్రేక్షకుల్లోనూ ఓ మాదిరి ఆసక్తి నెలకొంది. కేవలం పది రోజుల గ్యాప్ లో లాభం, తుగ్లక్ దర్బార్ తర్వాత వరసగా వచ్చిన మూడో విజయ్ సేతుపతి సినిమా ఇది. రిపోర్ట్ చూద్దాం

1940 కాలం. తన భార్య అన్నాబెల్లె(తాప్సి)కు కానుకగా వీర సేతుపతి(విజయ్ సేతుపతి)ఓ అద్భుతమైన ప్యాలెస్ ని నిర్మిస్తాడు. దీని చూసి కళ్ళు చెదిరిన మరో రాజు(జగపతిబాబు)సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ వీర సేతుపతి తిరస్కరిస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. కట్ చేస్తే వర్తమానంలో రుద్ర(తాప్సీ)అనే దొంగ తన బ్యాచ్ తో కలిసి ఈ భవంతిని దోచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే లోపల దెయ్యాలు ఉంటాయి. ఎప్పుడో డెబ్బై ఏళ్ళ క్రితం చనిపోయిన షణ్ముగం(యోగిబాబు)వాటికి హెడ్డుగా ఉంటాడు. మరి రుద్ర లక్ష్యం నెరవేరిందా మళ్ళీ వీర సేతుపతి తిరిగి వచ్చాడా అనేదే అసలు కథ

విజయ్ సేతుపతి ఫ్యాన్స్ గుర్తుంచుకోవాల్సింది అతను సినిమా మొత్తం కనిపించడు. కాకపోతే ఉన్నంతసేపు తన ఉనికిని చాటుకునేలా మెప్పించాడు. తాప్సీ తదితరులు తమ శక్తి మేరా చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చారు కానీ దర్శకుడు దీపక్ సుందర్ రాజన్ రొటీన్ కామెడీ హారర్ ట్రీట్మెంట్ తో చాలా మటుకు ఇది భారంగా సాగుతుంది. సన్నివేశాలు రిపీట్ కావడం, గతంలో ఎన్నో చిత్రాల్లో ఇలాంటివి చూశామే అన్నే ఫీలింగ్ కలగడం పెద్ద మైనస్. కృష్ణకిషోర్ సంగీతం కూడా సోసోనే. మరీ నెమ్మదిగా సాగే కామెడీని ఆస్వాదించే ఓపిక టైం ఉంటే మాత్రం ఈ అన్నాబెల్లె సేతుపతిని వీకెండ్ ఇంట్లో ట్రై చేయొచ్చు. అది కూడా జీరో అంచనాలతో సుమా

Also Read : ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే కష్టమే

Show comments