ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే కష్టమే

By iDream Post Sep. 17, 2021, 06:30 pm IST
ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే కష్టమే

టాలీవుడ్లో వరుసగా లీకేజీల టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆన్ లొకేషన్ నుంచి చాలా ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇది ఒక్కటి అనుకుంటే ఏకంగా మరి కొద్ది రోజులలో విడుదల చేయాలని భావిస్తున్న పాటలు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఏదో ఒక విధంగా ముందే ఆన్లైన్లో ప్రతిక్షణం అయ్యేలా చేస్తున్నారు లీకేజీ రాయుళ్ళు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పుష్ప అలాగే సర్కారు వారి పాట సినిమాల లీకేజీలు విషయంలో ఆ మధ్య ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి ఇలాంటి వారిని ఉపేక్షించపోయేది లేదని క్రిమినల్ చట్టాల కింద కూడా చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ ప్రకటన విడుదల చేసిన కొన్నాళ్ళకే మళ్లీ లీకుల వ్యవహారం మొదలైంది.

ప్రస్తుతానికి అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పసినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాకినాడ చుట్టుపక్కల ఉన్న ఒక కాకా హోటల్ లో అల్లు అర్జున్ దోశ తిని బయటకు వచ్చిన వీడియో కూడా వైరల్ ఐన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే కాకినాడ పోర్టు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు లీక్ అయింది. ఈ లీకయిన వీడియోలో బన్నీ చిత్తూరు యాసలో డైలాగ్స్ పలుకుతూ కనిపిస్తున్నాడు. అయితే సినిమా యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా షూటింగ్ చేసేది అవుట్డోర్ లొకేషన్స్ లో కాబట్టి ఎవరికి వాళ్లకు తెలియకుండానే ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగానే సెలబ్రిటీల చూస్తున్నాము అంటే కళ్లతో చూసే రోజులు పోయి ఫోన్ కెమెరాతో చూసే రోజులు వచ్చేశాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ అనూహ్యంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అని అంటున్నారు. వాస్తవానికి ఈ సీన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీన్ని ఖచ్చితంగా అవుట్డోర్ లోనే చేసి తీరాలి, ఏదైనా స్టూడియోలో ఒక పోర్ట్ సెట్ వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సీన్లు అవుట్డోర్లో చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వలన ఈ సినిమాకి పెద్ద నష్టమేమీ ఉండదు కానీ ముందే సీన్స్ బయటకు వచ్చేయడం వల్ల సినిమా మీద ఒక్కోసారి ఆసక్తి పెరిగే అవకాశాలు ఉండగా ఒక్కోసారి ఆసక్తి సన్నగిల్లే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇప్పటికైనా అవుట్ డోర్ షూటింగ్ విషయంలో సినిమా యూనిట్ సభ్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహించని పరిణామాలకి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read :  SD లాల్‌ని గుర్తుకు తెచ్చే మేర్ల‌పాక గాంధీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp