iDreamPost
android-app
ios-app

Vijay Sethupathi: గొప్ప మనసు చాటుకున్న విజయ్ సేతుపతి! కమెడియన్ కొడుక్కి..

  • Published Aug 16, 2024 | 3:51 PM Updated Updated Aug 16, 2024 | 3:51 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తమిళ్ కమెడియన్ కొడుక్కి సాయం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తమిళ్ కమెడియన్ కొడుక్కి సాయం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 16, 2024 | 3:51 PMUpdated Aug 16, 2024 | 3:51 PM
Vijay Sethupathi: గొప్ప మనసు చాటుకున్న విజయ్ సేతుపతి! కమెడియన్ కొడుక్కి..

విజయ్ సేతుపతి.. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. బాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ఇటీవలే ‘మహారాజా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తాజాగా విజయ్ సేతుపతి తన గొప్ప మనసును చాటుకున్నాడు. సినిమా రంగంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుంటుంబాలను ఆదుకుంటున్నాడు ఈ స్టార్ యాక్టర్. లేటెస్ట్ గా తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆర్థిక కష్టాల్లో ఉన్న కమెడియన్ కొడుక్కి సాయం చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తమిళ హాస్యనటుడు అయిన తెనాలి కుటుంబానికి అండగా నిలిచాడు. తెనాలి తమిళంలో చాలా సినిమాల్లో కమెడియన్ గా చేశాడు. అలాగు విజయ్ సేతుపతి సినిమాల్లో కూడా నటించాడు. అయితే తెనాలి కొడుకు విన్నరసన్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడు ట్యూషన్ ఫీజులు చెల్లించలేకపోతున్నాడని నటుడు భావ లక్ష్మణన్ ద్వారా విజయ్ సేతుపతి తెలుసుకున్నాడు. వెంటనే అతడి కాలేజీ ఫీజు రూ. 76 వేల రూపాయలను చెల్లించాడు. దాంతో పాటుగా ప్రతి సంవత్సరం చెల్లిస్తానని మాటిచ్చాడు. ఆయన గొప్ప మనసుకు వారు ధన్యవాదాలు తెలిపారు.

vijay sethupati good heart

నా కుటుంబానికి సాయం చేసిన విజయ్ సేతుపతిని ఎన్నటికీ మర్చిపోనని కమెడియన్ తెనాలి తెలిపాడు. కాగా.. ఆర్థికంగా చితికిపోయిన సినిమా ఆర్టిస్టులకు అండగా నిలుస్తూ.. వారికి సాయం చేస్తున్న విజయ్ సేతుపతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక ఆయన ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి తెగ సంతోషిస్తున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ‘విడుదలై పార్ట్ 2’తో పాటుగా మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss