Somesekhar
Nandamuri Balakrishna 50 Years Celebrations: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను టాలీవుడ్ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రెడీ అవుతోంది. ఇక ఈ వేడుకకు సంబంధించి సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఆ వివరాల్లోకి వెళితే..
Nandamuri Balakrishna 50 Years Celebrations: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను టాలీవుడ్ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రెడీ అవుతోంది. ఇక ఈ వేడుకకు సంబంధించి సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది తెలుగు సినీ పరిశ్రమ. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ లో ఈ స్వర్ణోత్సవాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు. ఇక ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజ నటులను తెలుగు ఫిలిం చాంబర్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను కలిసి, వేడుకకు హాజరు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.
నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం లెజెండరీ యాక్టర్స్ కు ఆహ్వానం పలుకుతున్నారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, ప్రముఖ సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్. తాజాగా తమిళ్, మలయాళ,కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు శివరాజ్ కుమార్,విజయ్ సేతు పతి,శివకార్తికేయన్, కిచ్చా సుదీప్,దునియా విజయ్,డైరెక్టర్ పి.వాసు, నాజర్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ లతో పాటుగా సీనియర్ హీరోయిన్లు సుహాసిని, మీనా,మాలాశ్రీ,సుమలతలను కలిసి బాలయ్య వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వీరితో పాటుగా రవి కొత్తర్కర(SIFCC&FFI ప్రెసిడెంట్), కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ హరీష్, ఆఫీస్ బేరర్స్ ను కలిసి తెలుగు సినీ పరిశ్రమ తరఫున తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ ఆహ్వానించారు. కాగా.. బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘తాతమ్మ కల’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 1974వ సంవత్సరం ఆగస్టు 30న విడుదలైంది. ఈ నెల ఆగస్టు 30తో బాలకృష్ణ నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు.