iDreamPost
android-app
ios-app

విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2పై క్రేజీ న్యూస్.. జస్ట్ నాలుగున్నర గంటలే అంట!

  • Published Aug 25, 2024 | 3:20 PM Updated Updated Aug 25, 2024 | 3:20 PM

Viduthalai Part 2 Duration Hints On Viduthalai Part 3: వేట్రిమారన్- విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన విడుదల సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విడుదల పార్ట్ 2 కూడా షూటింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు విడుదల పార్ట్ 2కి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

Viduthalai Part 2 Duration Hints On Viduthalai Part 3: వేట్రిమారన్- విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన విడుదల సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విడుదల పార్ట్ 2 కూడా షూటింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు విడుదల పార్ట్ 2కి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

  • Published Aug 25, 2024 | 3:20 PMUpdated Aug 25, 2024 | 3:20 PM
విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2పై క్రేజీ న్యూస్.. జస్ట్ నాలుగున్నర గంటలే అంట!

విజయ్ సేతుపతి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఉన్న విలక్షణమైన, మోస్ట్ బిజీ నటుల్లో ఈయన కూడా ఒకడు. హీరోగా, సపోర్టింగ్ యాక్టర్ గా, విలన్ గా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. అటు బాలీవుడ్ లో కూడా విజయ్ సేతుపతి తన మార్క్ ని చూపించాడు. అసలు విజయ్ సేతుపతి ఎంచుకునే కథలు చూస్తే ఎలాంటి వారికైనా పిచ్చెక్కిపోవాల్సిందే. ఇటీవల వచ్చిన మహారాజానే అందుకు చక్కని ఉదాహరణ. ఎలాంటి ఎలివేషన్స్, భారీ భారీ డైలాగ్స్ లేకపోయినా కేవలం కథ, తన నటనతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు. అలాంటి విజయ్ సేతుపతి నుంచి వచ్చిన విడుదల సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు విడుదల పార్ట్ 2 కూడా రాబోతోంది. అయితే ఇప్పుడు ఈ విడుదల పార్ట్ 2కి సంబంధించి ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

వేట్రిమారన్ విడుదల సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. విజయ్ సేతుపతి పాత్ర గురించి సినిమా మొత్తం ఎలివేషన్స్ ఉంటాయి. అయితే పార్ట్ 1లో విజయ్ సేతుపతి ఆఖర్లో మాత్రమే కనిపిస్తాడు. కానిస్టేబుల్ గా చేసిన సూరి చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఈసారి మాత్రం సినిమా మొత్తం విజయ్ సేతుపతి పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ పార్ట్ 2కి సంబంధించి షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్రేజీ వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. విడుదల సినిమా సీక్వెల్ ఫుటేజ్ అప్పుడే నాలుగున్నర గంటలు దాటిపోయింది అంట. ఇంకా 30 శాంత షూటింగ్ కూడా మిగిలి ఉందని తెలుస్తోంది.

70 శాతం మేర షూటింగ్ జరిగితినే ఫుటేజ్ నాలుగున్నర గంటలు వచ్చింది అని కోలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అలా అయితే అంతా సినిమాని ఒక పార్టులా తీసుకొచ్చే అవకాశం లేదనే చెప్పాలి. అందుకే సీక్వెల్ పూర్తి చేయకముందే.. పార్ట్ 3 గురించి కూడా ఆలోచన చేస్తున్నారంట. ముందు పార్ట్ 2ని పూర్తి చేసుకుని ఆ తర్వాత పార్ట్ 3కి సంబంధించి ప్రణాళికలు రచిస్తారని చెబుతున్నారు. మొదటి భాగం తరహాలోనే గ్రిప్పింగ్ స్టోరీగా దీనిని తయారు చేసుకుని.. పార్ట్ 3కి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. అయితే విడుదల సినిమాకి వచ్చిన రెస్పాన్స్, పార్ట్ 2 మీద ఉన్న అంచనాలు, వేట్రిమారన్ మీద ప్రేక్షకులకు ఉన్న నమ్మకం నేపథ్యంలో కచ్చితంగా పార్ట్ 3 వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే విడుదల పార్ట 3 గురించి కూడా ఆలోచిస్తారు అంటూ చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు విడుదల పార్ట్ 3 గురించి ఏమీ చెప్పలేం. ప్రస్తుతానికి అవి కేవలం పుకార్లు మాత్రమే.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş