iDreamPost
iDreamPost
సోషల్ మీడియా స్టార్ అంజలి అరోరా( Anjali Arora ), లాక్ అప్(Lock Upp) షోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ఈ ఏక్తా కపూర్ రియాలిటీ షోలో అంజలి బాగా ఆటాడింది. ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె సైయన్ దిల్ మే ఆనా రే(Saiyyan Dil Mein Aana Re) అనే పాటలో కనిపించనుంది. ఇది పాత పాటకు రీమేక్. ఈ షూట్ పిక్స్ ను తన ఇన్ స్టా ఎకౌంట్ లో పోస్ట్ కూడా చేసింది. కాని దురదృష్టవశాస్తూ MMS లీక్ వివాదంతో ఆమెపేరు హెడ్‌లైన్‌లలోకి వచ్చింది. దీనిపై ఆమె ఆవేదన చెందుతోంది. ఆమె పేరుమీదుగా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదిఆమె MMS లీక్ అని సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అటు కుటుంబాన్ని, ఇటు తనను బాధిస్తున్న ఈ వివాదంపై అంజలి మౌనం వీడింది.
సిద్ధార్థ్ కానన్ కి అంజలి ఇంటర్వ్యూనిచ్చారు. అందులో MMS లీక్ గురించి మాట్లాడుతూ, భావోద్వేగానికి లోనైయ్యారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతూ, ఫ్యాన్స్ ను సంపాదించుకుంటున్న తరుణంలో, ఇలాంటి వీడియోలతో కెరీర్ దెబ్బతినడమేకాదు, కుటుంబానికి తీరని క్షోభకలుగుతోందన్న ఆందోళన ఆమెలో కనిపించింది. అందరిలాగే తనకు కూడా ఒక కుటుంబం ఉందని, ఇలాంటి వీడియో లీక్స్ తో బాధపడతారని, మానసికంగా దెబ్బతింటారని అంజలి చెప్పింది. వ్యూస్ కోసం . సోషల్ మీడియాలో తన పేరును వీడియోకు పెట్టారని ఆమె ఆరోపించారు.
It's shameful to even think someone can go to this extent just to defame a person who is just out there living her life !!
Breaks my heart to see her like this !
Stay strong Anjali @AnjaliArora1050 #AnjaliArora #AnjaliAroraArmy pic.twitter.com/IGc9h7raHN— ANJALI ARORA OFFICIAL FC (@TeamAnjaliArora) August 11, 2022
తన ఫేక్ వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదని, సోషల్ మీడియా దారుణాలకు తాను బలవుతున్నానని అంజలి వాపోయింది. వాస్తవానికి, ఆమె లాక్ అప్ షోలో ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు నకిలీ వీడియోలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పింది. ఫేక్ వైరల్ వీడియోల వల్ల తన సోదరుడు, బాయ్ ఫ్రెండ్ ఆకాష్ , పేరెంట్స్ కూడా సైబర్ సెల్‌లో రిపోర్ట్ చేశారని అంజలి ఆరోరా చెప్పారు.