iDreamPost
android-app
ios-app

అవును..నిజమే, ఆంధ్రజ్యోతి కి అన్నీ అలానే కనిపిస్తాయి.!

  • Published Sep 12, 2021 | 4:06 AM Updated Updated Sep 12, 2021 | 4:06 AM
అవును..నిజమే, ఆంధ్రజ్యోతి కి అన్నీ అలానే కనిపిస్తాయి.!

చంద్రబాబు ప్రభుత్వానికి జనం ఓటమి రుచి చూపిన నాటి నుంచి ఆంధ్రజ్యోతి కథ మారింది. అనూహ్యంగా రాధాకృష్ణ అద్దాలు మారిపోయాయి. పసుపు పచ్చని ఆంధ్రా కాస్తా ఆకుపచ్చగా మారడం జీర్ణించుకోలేని స్థితికి చేర్చింది. అందుకే అప్పటివరకూ ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోయేది. కానీ హఠాత్తుగా టీడీపీ పరాజయం తలకిందులైందన్నట్టుగా కథనాలు వస్తున్నాయి.. అప్పటి వరకూ ప్రజలు అమితానందంలో ఉండేవారు  కానీ ఆ తర్వాత అసంతృప్తి జీవులయిపోయారనే రీతిలో కహానీలు అల్లుతున్నారు. అప్పటిదాకా సుభిక్షంగా ఉన్న రాష్ట్రం అమాంతంగా సంక్షోభంలో పడిపోయిందనే పద్ధతిలో అబద్ధాలు వండి వారుస్తున్నారు. పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం కావడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. లేదంటే ఈ పాటికే సన్ రైజ్ స్టేట్ మూన్ లైట్ లా వెలిగిపోయెదనడానికి కూడా సంకోసించడం లేదు.

ఆక్రమంలోనే సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ గురించి పతాక శీర్షికలో ఓ కట్టుకథ అచ్చేసింది. ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తూ సీఎస్ ఇక్కట్లలో పడుతున్నారని రాసిన రాతలు ఇంకా మరవకుండానే సీఎం చెప్పింది చేయనందుకే ఆయన మారిపోతున్నారని రాసేసింది. జగన్ ఏది చెబితే అదే చేస్తున్నారని రాసి నాలుగు రోజులు గడవకముందే జగన్ ఆగ్రహానికి గురయ్యారని రాయడమంటే ఎంత సిగ్గుమాలిన పని  అయినా దమ్మున్న పత్రికకు అదేమీ పట్టదు. అన్నింటా జగన్ వ్యతిరేకత జోడించి జనాలని మభ్యపెట్టగలమని భ్రమించడమే అలవాటుగా మార్చుకుంది.

ఏపీ సీఎస్ గా ఆదిత్యనాధ్ దాస్ని నియమించినప్పుడు జ్యోతి ఎంత విషపుప్రచారం చేసింది? సీనియర్లను కాదని దాస్ ని చీఫ్ సెక్రటరీ చేయడానికి కారణాలంటూ ఎన్ని వక్రభాష్యాలు చెప్పింది? అప్పట్లో సీనియారిటీ ప్రాతిపదికన 7వ స్థానంలో ఉన్న ఆదిత్యనాధ్ నియామకానికి కారణాలు అంటూ ఎన్ని అర్థసత్యాలు అల్లింది? ఇప్పుడుఅవన్నీ అమరచిపోయి మళ్ళీ ఆయనకేఅన్యాయం అంటూ ఆపసోపాలు పడుతోంది. గత ఏడాదినీలం సాహ్ని స్థానంలో  ఆదిత్యనాధ్ దాస్ నినియమించినప్పుడు  రాధాకృష్ణపత్రిక రాతల్లో నిజం ఉంటే ఇప్పుడెందుకు ఇలా మాట మార్చాలి. జగన్ గతంలోనే ఆదిత్యనాధ్ దాస్ ని సీఎస్ చేస్తానని,మాట ఇచ్చారని అందుకే సీనియర్లను కాదని సీఎస్ చేయడమే కాకుండాపదవీకాలం పొడిగించి ఆయన్ని కొనసాగిస్తున్నారని ఆంధ్రజ్యోతి వార్తలు రాయలేదా?

ఆంధ్రజ్యోతి అసలు లక్ష్యం 20 రోజుల ముందే కొత్త సీఎస్ జీఓగురించి కాదని, అధికారుల్లో జగన్ పట్ల అపనమ్మకం కలిగించడమేనని ఇట్టే అర్థమవుతోంది. ఓవైపు అధికారులు జగన్ చెప్పిందే చేస్తున్నారని ఆరోపిస్తూ మరోవైపు సీఎం చెప్పింది సీఎస్ చేయనందుకే ఇలా జరిగిందని చిత్రీకరించ పూనుకోవడం నభూతో నః భవిష్యత్ అనే చెప్పాలి. కానీ అసలు కథ ఏమంటే నీలం సాహ్ని తరహాలో ఆదిత్యనాధ్ కూడా సీఎస్ గాపదవీవిరమణ తర్వాత కూడా ప్రభుత్వంలో కొనసాగబోతున్నారు. దాదాపుగా జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు హోదా ఆయనకి దక్కే అవకాశం ఉంది. కాబట్టి జ్యోతి చిత్రాల వ్యవహారం  చెల్లుబాటయ్యే ఛాన్స్ లేదు.ఇలాంటి జిమ్మిక్కులతో జనాల్ని నమ్మించవచ్చనే ప్రయత్నం ఫలించే ఆ అవకాశాలు లేవు.