iDreamPost
android-app
ios-app

థర్డ్ వేవ్.. ఏపీలో పాక్షిక లాక్ డౌన్.. మార్గదర్శకాలు విడుదల

థర్డ్ వేవ్.. ఏపీలో పాక్షిక లాక్ డౌన్.. మార్గదర్శకాలు విడుదల

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. వారం క్రితం రోజుకు ఆరేడు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి నుంచి.. ఒక్కసారిగా పదిరేట్లు పెరిగే స్థాయికి చేరుకుంది. బుధ, గురు, శుక్రవారాల్లో వరుసగా 55 వేలు, 90 వేలు, లక్ష కేసులు చొప్పున నమోదయ్యాయి. ఏపీలో కేసుల సంఖ్య వందల్లోనే ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జగన్ సర్కార్ పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. రేపు శనివారం నుంచే పాక్షిక లాక్ డౌన్ అమల్లోకి రానుంది.

పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలు..

– సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు బార్‌లు 50 శాతం ఆక్యుపెన్సీతో రాత్రి 10 గంటల వరకు నడుస్తాయి.

– విద్యా సంస్థలు, కార్పొరేట్ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, స్పాలు, జిమ్‌లు, మాల్‌లు, పార్క్‌లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలు పూర్తిగా మూసివేయాలి.

– ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు  యథావిధిగా నడుస్తాయి.

సాధారణ దుకాణాలు, మార్ట్ మరియు ఇతర రిటైల్ దుకాణాలు ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు తెరుచుకుంటాయి.

– కర్ఫ్యూ రాత్రి 10 నుండి ఉదయం 5 వరకు కొనసాగుతుంది.

Also Read : ప్రస్తుతానికి ముందుకే.. రేపు ఎలా ఉంటుందో..?