Idream media
Idream media
మీడియాలో న్యూస్ రైటర్స్ కన్నా.. న్యూస్ మేకర్స్‌కు మంచి ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుంది. సంఘటనలను ఆధారంగా చేసుకుని న్యూస్ మేకర్స్ న్యూస్‌ను సృష్టిస్తారు. ఆయా వార్తలు పాఠకులను బాగా ఆకట్టుకుంటాయి. చదివిస్తాయి. న్యూస్ మేకర్స్‌లోనే మరో వర్గానికి చెందిన వారు ఉంటారు. సంఘటనల ఆధారంగానే వారు వార్తలు సృష్టిస్తారు. అయితే అవి వారికి నచ్చినట్లుగా ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఆయా వార్తలను వారు సృష్టిస్తుంటారు. ఆంధ్రజ్యోతి ఈ కోవకే చెందినది.
సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఆంధ్రజ్యోతి నిత్యం యత్నిస్తుంటుంది. రోజూ జరిగే ఘటనలను ఆధారంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ కమ్రంలోనే నూతన ఎమ్మెల్సీల నియామక వ్యవహారంపై తనకు నచ్చినట్లుగా కథనాలు వండి వార్చింది. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సీఎం వైఎస్ జగన్.. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, కొయ్యే మోషేన్‌రాజు, ఆర్‌వీ రమేష్‌ల పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు జాబితా పంపారు. అయితే ఆ జాబితాను ఆమోదించే గ్యాప్‌లో ఆంధ్రజ్యోతి తన మార్క్ జర్నలిజాన్ని బయటపెట్టింది.
తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డిలపై కేసులు ఉండడంతో వారి పేర్లపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, గవర్నర్ పదవి పవర్ చూపిస్తున్నారంటూ.. రాసుకొచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు గవర్నర్ బ్రేక్ అంటూ గవర్నర్ ఏమనుకుంటున్నారో ఊహించి రాసేసింది. వారిపై కేసులు ఉన్నప్పుడే.. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారనే విషయం తన పాఠకుల వద్ద దాచిపెట్టింది. 24 గంటలు తిరగముందే.. మళ్లీ ఈ రోజు ఎమ్మెల్సీ ఫైలుకు ఆమోదం.. వారిద్దరి కేసులపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు.. అందుకే ఆమోదం తెలిపారు.. అంటూ సీఎంకు, గవర్నర్‌కు మధ్య జరిగిన సంభాషణను ప్రత్యక్షంగా వినినట్లు రాసుకొచ్చింది.
నామినేటెడ్ ఎమ్మెల్సీలకు గవర్నర్ బ్రేక్ అంటూ.. నిన్న బ్యానర్ కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. ఈ రోజు ఎమ్మెల్సీల ఫైలుకు ఆమోదం అంటూ.. మొదటిపేజీ చివర కేవలం ఇండికేషన్ ఇచ్చి.. వార్తను 12వ పేజీలో ప్రచురించింది. ప్రభుత్వాన్ని బద్నాం చేసే కథనం బ్యానర్‌గా ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. అదే అంశానికి సంబంధించిన వార్తకు మరుసటి రోజు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం రాథాకృష్ణ మార్క్ జర్నలిజానికి పరాకాష్ట.
Also Read : నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం