iDreamPost
android-app
ios-app

జస్ట్ మిస్.. సుమక్కకి తృటిలో తప్పిన ప్రమాదం

  • Published May 07, 2022 | 3:02 PM Updated Updated May 07, 2022 | 3:02 PM
  • Published May 07, 2022 | 3:02 PMUpdated May 07, 2022 | 3:02 PM
జస్ట్ మిస్.. సుమక్కకి తృటిలో తప్పిన ప్రమాదం

తెలుగు వారిళ్లలో ఒకరిగా మారిపోయిన బుల్లితెర మహారాణి యాంకర్ సుమ ప్రతి రోజు ఏదో ఒక షోతో గత కొన్ని సంవత్సరాలుగా మనల్ని పలకరిస్తూనే ఉంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఒక సినిమాలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మెరిపించే సుమ చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల మెయిన్ లీడ్ లో జయమ్మ పంచాయతీ అనే సినిమా చేసింది. మే 6న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కోసం సుమ తన ఇన్నేళ్ల అనుభవాన్నంతా వాడి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలందరితో ప్రమోషన్ చేయించింది.

తాజాగా యాంకర్ సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. జయమ్మ పంచాయితీ సినిమా టైంలో ఓ అడవిలో షూటింగ్ చేస్తుండగా అక్కడ నీటి ప్రవాహం ఉన్న రాళ్ల మీద నిలబడి ఉండి షాట్ కోసం ఎదురు చూస్తుంది. అయితే సుమ నిల్చున్న ఆ రాళ్లు పీచు పట్టి ఉండటంతో సుమ అనుకోకుండా జారి పడింది. వెంటనే అక్కడ ఉన్న చిత్ర సిబ్బంది స్పందించి సుమని కాపాడారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన సుమ జయమ్మ పంచాయితీ షూటింగ్ టైంలో కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అని తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారగా నెటిజన్లు, అభిమానులు సుమక్క జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio