iDreamPost
iDreamPost
సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది యాంకర్ అనసూయ. తనని, తన కుటుంబాన్ని అవమానిస్తూ ట్విట్స్ చేస్తే, వాళ్లలపై కేసులుపెట్టి జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చింది. గురువారం, అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ శాపనార్థలు పెడుతూ ఆమె చేసిన ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నెగిటీవ్ గా తీసుకున్నారు. విజయ్‌ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందంటూ ఫైర్ అయిన ఫ్యాన్స్, ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. అంతే అనసూయకు, విజయ్ ఫ్యాన్స్‌కు వార్ మొదలైంది. తనను ట్రోల్ చేస్తున్న ప్రతి ఫ్యాన్‌కు అనసూయ వార్నింగ్ ఇస్తుంది.
ఛీ…ఛీ…అసలు ఇంత చెత్తా!! బాబాయో, క్లీన్ చేసి, చేసి విసుగొస్తోంది. ఇలాంటి వివాదాల్లోకి నా కుటుంబాన్ని లాగితే మిమ్మల్ని కటకటాల్లోకి పంపించాల్సి వస్తోంది. ఇకపై నన్ను అంటీ అని పిలుస్తూ అవమానించేలా పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి అకౌంట్ స్క్రీన్ షాట్స్ తీసుకొని పోలీసు కేసుపెడతా. ఇదే నా ఆఖరి వార్నింగ్ అంటూ అనసూయ హెచ్చరించారు. తనను ట్రోల్ చేస్తున్న, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నవారందరి ట్వీట్స్ ను రీట్వీట్ చేస్తూ, క్లాసు తీసుకొంటున్నారు.
Correction.. Mrs.Anasuya
Na pillala friends evaro naku telusu.. nenu vaallaki telusu.. vaalla age ki nenu telusu kabatti nannu prema to ala pilavatam accept cheyatam veru.. mee uddesham to ala pilavatam veru.. vitanda vaadalaki digite em labham undadu#StopAgeshaming https://t.co/ZAxIIRCpUY
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 26, 2022
తనని ఆంటీ అని పిలుస్తూ అవమానిస్తున్నారన్న అనసూయ పోస్ట్ కి ఓ నెటిజన్ ఆంటీ అనే పదాన్ని బూతుగా మార్చేశావ్‌గా అంటూ కామెంట్ చేశాడు. దీనికి ఆమె ‘నా పిల్లల ఫ్రెండ్స్ పిలవడంలో, మీరు పిలవడంలో తేడా ఉంది. మీరు పలిచే ఉద్దేశం వేరు’ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఫ్యాన్స్ కామెంట్స్ ని తిప్పికొడుతున్న అనసూయ, మీరు నన్ను ఎంతగా నిందించినా, ఆ వ్యాఖ్యలన్నింటినీ మీ అభిమాన హీరో, హీరోయిన్ కి బదిలీ చేస్తున్నా అని పోస్ట్ లో రాశారు. #saynotoonlineabuse హ్యాష్ టాగ్ తో హేటర్స్ కి గట్టిగా సమాధానమిస్తున్నారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 26, 2022