iDreamPost
android-app
ios-app

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో ఇంత మంది స్టార్స్ ఉన్నారా..? అస్సలు గెస్ చేయలేరు

  • Published Aug 22, 2024 | 1:41 PM Updated Updated Aug 22, 2024 | 1:41 PM

Life Is Beautiful: శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల్లో ఒకటి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. 2012లో న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీలో ఈ స్టార్స్ ఉన్నారని తెలుసా..?

Life Is Beautiful: శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల్లో ఒకటి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. 2012లో న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీలో ఈ స్టార్స్ ఉన్నారని తెలుసా..?

  • Published Aug 22, 2024 | 1:41 PMUpdated Aug 22, 2024 | 1:41 PM
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో ఇంత మంది స్టార్స్ ఉన్నారా..? అస్సలు గెస్ చేయలేరు

సింపుల్ అండ్ కామ్ గోయింగ్ చిత్రాలను తెరకెక్కించడంతో దిట్ట శేఖర్ కమ్ముల. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాలను తీసి.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. డాలర్ డ్రీమ్స్ దగ్గర నుండి లవ్ స్టోరీ వరకు ఈ జోనర్ సినిమాలే ఎక్కువ. శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ పిక్చర్స్ కచ్చితంగా గుర్తుకు వస్తాయి. అలాగే కొత్త వాళ్లతో తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ కూడా హార్ట్ టచ్ చేస్తుంది. 2012లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ శేఖర్ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో చాలా గ్యాప్ తర్వాత ఒకప్పటి అందాల తారలు అమల అక్కినేని, అంజలా జవేరి కనిపించడం విశేషం. ఇక ఇందులో అభిజిత్, సుధాకర్, కౌశిక్ దర్బా హీరోలుగా నటించారు. అయితే వీరే కాదు.. ఇందులో చాలా మంది స్టార్ట్స్ నటించారన్న విషయం తెలుసా..? ఇంతకు వాళ్లెవరంటే..?

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో అభిజిత్ బీ ఫేజ్ గ్యాంగ్, గోల్ట్ ఫేజ్ మధ్య వార్ నడుస్తూ ఉంటుంది .ఈ గోల్ట్ ఫేజ్ గ్యాంగ్‌లోనే ఉన్నారు మన స్టార్ హీరోలు నవీన్ పోలిశెట్టి అండ్ విజయ్ దేవరకొండ. రాకేశ్ పాత్రలో నవీన్ గోల్టెన్ ఫేజ్‌ టీంకు లీడర్‌గా వ్యవహరిస్తుంటాడు. బీ ఫేజ్, గోల్ట్ ఫేజ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓడిపోవాలంటూ అభిజిత్‌కు 50 వేలు ఇస్తా.. ఓడిపోవాలంటూ ఆశ చూపెడుతుంటాడు. మూవీ ఎండింగ్‌లో కూడా ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో నవీన్ పోలిశెట్టి చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడు. అలాగే విజయ్ దేవరకొండ కూడా గోల్డ్ ఫేజ్ అబ్బాయి అజయ్‌గా, నవీన్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. ఇక శ్రీ విష్ణు నటించాడని చాలా మందికి తెలియదు. అభిజిత్ బావగా.. నవీన్ పోలిశెట్టి సోదరిని సోని (శ్రీముఖి)ని ప్రేమించి పెళ్లి చేసుకునే అజయ్ పాత్రలో మెరిసింది మన శ్రీవిష్ణునే.

Sekhar Kammula Life Is Beautiful Movie actors

ఇక ఇందులో ఈ ముగ్గురే కాకుండా.. హరిణి పాత్రలో ఈషా రెబ్బ కనిపిస్తుంది. శ్రీవిష్ణు, శ్రీముఖి రిసెప్షన్ లో ఈ తెలుగు బ్యూటీ మెరుస్తుంది. అలాగే తేజశ్వి మడివాడ కూడా ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. మరో స్టార్ హీరోయిన్ చాందినీ చౌదరి కూడా యాక్ట్ చేసింది. ఈషా, చాందినీ చౌదరికి కూడా ఇదే డెబ్యూ ఫిల్మ్. వీరే కాకుండా ఈ సినిమాలో స్టార్ కాస్ట్ అంటే శ్రియానే. అమల, జవేరి మినహాయించి మిగిలివన్నీ కొత్త ముఖాలే. ఇక ఇందులో మరో స్టార్ డైరెక్టర్ నటించాడని తెలుసా.? అతడే ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులను డీల్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. బీ ఫేజ్, గోల్ట్ ఫేజ్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు రిఫరీగా కనిపిస్తాడు. విజయ్, నవీన్ ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒకడు. శేఖర్ కమ్ముల దగ్గర శిష్యరికం చేసిన నాగీ మామ… ఇప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet