Idream media
Idream media
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఒమిక్రాన్ వేరియంట్ తో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ టైమ్ లో మందు పంపిణీ చేసి వివాదాస్పదమైన ఆయన.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌కు మందు పంపిణీ చేస్తానని చెప్పడంతో మరోసారి వివాదం రాజేశారు. అటు తమ గ్రామంలో మందు పంపిణీ వద్దని కృష్ణపట్నం వాసులు డిమాండ్ చేస్తుండగా, అటు ఒమిక్రాన్ కు మందు పంపిణీ చేసేందుకు అనుమతి లేదని ఆయూష్ చెబుతోంది.
అయితే ఆనందయ్య మాత్రం తన మందు అన్ని రోగాలకు పనిచేస్తుందని చెబుతున్నారు. ఒమిక్రాన్‌కు మాత్రమే పనిచేస్తుందని చెప్పలేదన్నారు. దీంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు మళ్లీ మార్మోగుతోంది. కాగా, తాజాగా ఆనందయ్య హైకోర్టు మెట్లెక్కారు. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని అడ్డుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆయుర్వేద మందు కోసం తన దగ్గరకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని, దీనిని నివారించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆనందయ్య మందు పంపిణీ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కరోనా పేషెంట్లతో తమకు కూడా కరోనా సోకుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆనందయ్య ఇంటి దగ్గర ధర్నాకు కూడా దిగారు. మరోవైపు ఆనందయ్య మందుపై ఆంక్షలు విధించారు జాయింట్ కలెక్టర్. అనుమతులు లేకుండా పంపిణీ చేస్తే చర్యలు తప్పవంటూ నోటీసులిచ్చారు. హేతువాద సంఘాలు అభ్యంతరాలు, అధికారుల వార్నింగ్ లు ఆనందయ్య ఇదేందయ్యా.. 7 నెలల క్రితం చూసిన ఆనందయ్య కళ్ళలో ఉన్న గర్వం, ఆనందం ఇప్పుడు లేేవేంటయ్యా అంటూ జనం జాలి చూపుతున్నారు..
నేడు విచారణ…
ఆనందయ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. జస్టిస్ డి రమేష్ ముందు దీనిపై వాదనలు విననున్నారు. కాగా గతంలోనూ హైకోర్టు సహాయంతో కరోనా మందు పంపిణీకి అనుమతి పొందారు ఆనందయ్య. ఈ సంగతి పక్కన పెడితే ఒమిక్రాన్ నివారణకు ఆయన తయారుచేసిన మందుపై రగడ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ఆ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్ చెబుతుంటే.. ఊళ్లో మందు పంపిణీ చేయొద్దంటూ కృష్ణపట్నం వాసులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
Also Read : ఆనందయ్యపై గ్రామస్తులు ఎందుకు తిరుగుబాటు చేశారు..?